Ram Mandir inauguration: రామమందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. జనవరి 22న అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరగబోతోంది. ఈ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా భక్తులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అయోధ్యతో పాటు ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా పండగ వాతావారణం నెలకొంది. దేశవ్యాప్తంగా భక్తులు ఈ మహత్తర ఘట్టాన్ని చూసేందుకు అయోధ్యకు వెళ్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన 7000 మంది అతిథులుగా రాబోతున్నారు. దీంతో అయోధ్య వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది యూపీ సర్కార్.
Read Also: Ram Mandir: అయోధ్య రామమందిర వేళ ఒక్కసారిగా కాషాయ జెండాలకు డిమాండ్..
ఇదిలా ఉంటే, రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలో హోటల్ బుక్సింగ్ భారీగా పెరిగాయి. నగరంలోని హోటళ్లలో 80 శాతం ఇప్పటికే బుక్ అయ్యాయి. దీంతో పాటు హోటల్ రూముల ధరలు ఐదు రెట్టు పెరిగాయి. పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటడంతో వేగం హోటల్ గదులు బుక్ అవుతున్నాయి. రామాలయ వేడులకలను చూసేందుకు అయోధ్యకు 3 నుంచి 5 లక్షల మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది.
ఈ ఈవెంట్క ముందు మేక్మై ట్రిప్, బుకింగ్.కామ్ వంటి ఆన్లైన్ ట్రావెల్ వెబ్సైట్లు అయోధ్యలోని చాలా హోటళ్లలో ‘నో ఎవైలబిలిటీ’ని చూపిస్తున్నాయి. గదులు అందుబాటులో ఉంటే, అద్దె సాధారణ సగటు కంటే ఐదు రెట్లు పెరిగింది. అయోధ్యలోని సిగ్నెట్ కలెక్షన్ హోటల్ ప్రతినిధి మాట్లాడుతూ.. మెజారిటీ గదులు ఇప్పటికే బుక్ అయ్యాయని, మిగిలిన గదులకు రూ. 70,240కి అందుబాటులో ఉందని అన్నారు. మరికొన్ని హోటళ్లలో గదులు ధర రూ. 50 వేలకు పైగానే ఉంది. ముఖ్యంగా విలాసవంతమైన హోటళ్లలో గదులను బుక్ చేసుకోవాలంటే రూ. 1 లక్ష చెల్లించాల్సిందే.