Joe Biden Fired on Benjamin Netanyahu: ఇరాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు సంబంధించి ఫోన్ సంభాషణ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మండిపడ్డారు. “నన్ను మోసం చేయడం ఆపండి”.. అంటూ నెతన్యాహుతో చెప్పాడు. ప్రముఖ వార్త మీడియా నివేదిక ప్రకారం., బందీలకు బదులుగా హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని చర్చలకు ఇజ్రాయెల్ ముందుకు తీసుకువెళుతోందని.. త్వరలో ప్రతినిధి బృందాన్ని పంపుతుందని నెతన్యాహు చెప్పినప్పుడు బిడెన్ కోపంగా ఉన్నాడు.
Illicit Relationship: మహిళా ఎస్సైతో ఎస్సై రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. చివరకు?
నివేదిక ప్రకారం, గత గురువారం అధ్యక్షుడు బిడెన్, ప్రధాన మంత్రి నెతన్యాహు మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఆ సమయంలో అధ్యక్షుడు బిడెన్ ‘ఇలాంటి అధ్యక్షుడిని తేలికగా తీసుకోకూడదు’ అని అన్నారు. ఈ విషయంలో, అమెరికా అధ్యక్షుడితో తన వ్యక్తిగత చర్చలపై ప్రధాని వ్యాఖ్యానించరని నెతన్యాహు కార్యాలయం తెలిపింది. ప్రధాన మంత్రి అమెరికా రాజకీయాల్లో జోక్యం చేసుకోరు. అలాగే ఇజ్రాయెల్ రాజకీయాలలో అమెరికా కూడా జోక్యం చేసుకోకూడదని ఆశిస్తున్నారు. అమెరికా, ఈజిప్ట్ సహా పలు దేశాలు గాజాలో కాల్పుల విరమణను సమర్థిస్తున్నాయి. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటివరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు . ఇంతలో ఇరాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాను ఇజ్రాయెల్ హత్య చేసింది. ఆ తర్వాత మరోసారి ఉద్రిక్తత పెరిగింది. నేరుగా దాడి చేయాలని ఇరాన్ తన సైన్యాన్ని ఆదేశించింది. ఈ పరిస్థితిలో ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్ ఇప్పుడు యుద్ధం అంచున ఉన్నాయి.
Dhanush: మొత్తానికి ఊపిరి పీల్చుకున్న ‘రాయన్’ బయ్యర్స్.. కలెక్షన్స్ ఎంతంటే..?