NTV Telugu Site icon

Delhi: సీఎం రేఖా గుప్తాకు అతిషి లేఖ.. దేనికోసమంటే..!

Atishi

Atishi

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అతిషి లేఖ రాశారు. మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే పథకం గురించి చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఫిబ్రవరి 23న ఆప్ శాసనసభా పక్షాన్ని కలవడానికి సమయం ఇవ్వాలని లేఖలో రేఖా గుప్తాను కోరారు.

ఇది కూడా చదవండి: Delhi CM Rekha Gupta: ‘శీష్ మహల్’ వద్దన్న ఢిల్లీ కొత్త సీఎం.. అధికార నివాసం ఎక్కడంటే?

ఈనెల 20నే ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు. సాయంత్రం కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఆయుష్మాన్ భారత్ పథకంపై నిర్ణయం తీసుకున్నారు. ఇక రేఖా గుప్తా ప్రమాణస్వీకారం రోజునే అతిషి ప్రెస్‌మీట్ పెట్టి.. తొలి కేబినెట్‌లోనే మహిళలకు రూ.2,500 పథకంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కదా? అని నిలదీశారు. ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. దీనిపై శుక్రవారం రేఖా గుప్తా స్పందిస్తూ.. ఒక్క రోజు కాకముందే అతిషి విమర్శలు చేస్తున్నారంటూ తప్పుపట్టారు. కాంగ్రెస్, ఆప్ పాలించిన రోజులు గుర్తుచేశారు. మీరేం చేశారంటూ రేఖా గుప్తా తిరిగి ప్రశ్నించారు. తాజాగా మరోసారి అతిషి.. మహిళలకు రూ.2,500 పథకం గురించి లేఖ రాశారు. దీనిపై రేఖా గుప్తా ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇది కూడా చదవండి: Bangalore: స్నేహం ముసుగులో.. మహిళపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్టు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48, ఆప్ 22 సీట్లు సాధించాయి. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అనూహ్యంగా రేఖా గుప్తాకు ముఖ్యమంత్రి పదవి దక్కింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. ఆర్‌ఎస్ఎస్‌తో మంచి సంబంధాలు ఉండడంతో అవకాశం దక్కినట్లుగా వార్తలు వినిపించాయి.