ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అతిషి లేఖ రాశారు. మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే పథకం గురించి చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఫిబ్రవరి 23న ఆప్ శాసనసభా పక్షాన్ని కలవడానికి సమయం ఇవ్వాలని లేఖలో రేఖా గుప్తాను కోరారు.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. నగరంలో పలు చోట్ల తీవ్ర విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో సోషల్ మీడియా వేదికగా కంప్లంట్‌లు పెరిగిపోయాయి. అప్రమత్తమైన ఆప్ ప్రభుత్వం.. సమస్య పరిష్కారం కోసం కేంద్రానికి ఆప్ మంత్రి అతిషి లేఖ రాశారు.