Arvind Kejriwal: జైలులో కేజ్రీవాల్‌ని కలిసిన అతిషి, రాఘవ్ చద్దా.. ఢిల్లీ నీటి సంక్షోభంపై చర్చ..
- జైలులో కేజ్రీవాల్‌ని కలిసిన ఆప్ నేతలు..
- ఢిల్లీ నీటి సంక్షోభంపై చర్చ..
- ప్రజల గురించే సీఎం ఆలోచిస్తున్నారన్న అతిషి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీలో నీటి సంక్షోభం తారాస్థాయికి చేరింది. నీటి కోసం ప్రజలు ట్యాంకర్ల వెంట గుమిగూడిన దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఢిల్లీలో కొనసాగుతున్న నీరు మరియు విద్యుత్ సంక్షోభాల మధ్య, తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని మంత్రి అతిషీ, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాలు ఈ రోజు కలిశారు. సీఎం కేజ్రీవాల్ వీలైనంత త్వరగా ఢిల్లీలో నీటి సమస్యల్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
‘‘కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసుతో తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ని ఈ రోజు కలిశాను. ఆయన తన కన్నా ఢిల్లీ ప్రజల గురించే ఆందోళన చెందుతున్నారు. విద్యుత్, నీటి సమస్యల గురించి ఆరా తీశారు. ఢిల్లీలో నీటి ఎద్దడిని తాను తీహార్ జైలులో చూసినట్లు చెప్పారు.’’ అని మీడియాతో అతిషి అన్నారు. వీలైనంత త్వరగా నీటి ఎద్దడిని అధిగమించేందుకు అవసరమైన అన్ని చర్యలు మరియు ఏర్పాట్లు చేయాలని కేజ్రీవాల్ తమని ఆదేశించారని చెప్పారు. ఆప్ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి వారి ప్రాంతాల ప్రజలకు నీరు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారని అన్నారు.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
Read Also: UP: టెర్రస్ పై నిద్రిస్తున్న 6ఏళ్ల బాలుడిని ఎత్తుకెళ్లిన చిరుత..ప్రాణాలు వదిలిన చిన్నారి
రెండు రోజుల క్రితం ఉత్తర్ ప్రదేశ్‌లో అగ్ని ప్రమాదం కారణంగా ఢిల్లీలో విద్యుత్ కోతల గురించి కూడా కేజ్రీవాల్ ఆరా తీశారని, భవిష్యత్తులో విద్యుత్ సంక్షోభం తలెత్తకుండా ఉండేందుకు సంబంధిత అధికారులతో సమావేశాలను నిర్వహించాలని సూచించినట్లు అతిషి చెప్పారు. జైలులో ఉండి కూడా కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలు, వారి సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని ఆమె వెల్లడించారు. బుధవారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ తీహార్‌లో కేజ్రీవాల్‌ను పరామర్శించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ని మార్చిలో ఈడీ అరెస్ట్ చేసింది. దాదాపుగా 50 రోజులు జైలులో ఉన్న తర్వాత ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మే నెలలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 20 రోజుల తర్వాత ఆయన జూన్ 2న తీహార్ జైలులో లొంగిపోయారు. ఈ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారి అని ఈడీ ఆరోపించింది.
తాజావార్తలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!