జార్ఖండ్‌లోని జమ్తారాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది దుర్మణం చెందారు. రైల్లో మంటలు చెలరేగడంతో భయాందోళనతో ప్రయాణికులు కిందకు దూకేశారు. అదే సమయంలో ఝఝా-అసన్సోల్ రైలు ఎదురుగా వస్తోంది. దీంతో ఆ రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘనాస్థలికి బయల్దేరారు. చీకటి కావడంతో సహాయ చర్యలకు ఇబ్బందులు కలుగుతున్నట్లు సమాచారం.
జమ్తారా-కర్మతాండ్‌లోని కల్జారియా సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. మరి కొందరికి గాయాలైనట్లు వార్తలు వస్తున్నాయి. రైల్వే పోలీసులు, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆంగ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా సడన్‌గా రైల్లో మంటలు చెలరేగాయి. ఈ వార్త విన్న ప్రయాణికులు రైలు నుంచి కిందకి దూకేశారు. ఇంతలో ముందు నుంచి వస్తున్న ఝఝా-అసన్సోల్ రైలు ప్రయాణికులపై నుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు మొత్తం 12 మంది మృతి చెందగా.. మరికొంత మంది గాయపడినట్లు సమాచారం.

Ace