Assembly election results 2023: 4 రాష్ట్రాల్లో సీఎంలు అయ్యే అవకాశం వీరికే ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assembly election results 2023: 2024 లోక్‌సభ ఎన్నికల ముందు దేశం మొత్తం కూడా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాయి. ఈ రోజు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపొందితే.. మిగిలిన మూడు రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకుంది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో సీఎంలుగా ఎవరుంటారనే చర్చ జరుగుతోంది. పాతవాళ్లనే కొనసాగిస్తారా..? లేక కొత్త ముఖాలు అధికారాన్ని చేపడుతాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
Also Read
తెలంగాణ:
తెలంగాణలో చూస్తే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా రేసులో ఉన్నారని వారి అనుచరులు చెబుతున్నారు. అధిష్టానం ఎటువైపు మొగ్గు చూపుతుందో చూడాలి.
మధ్యప్రదేశ్:
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2006 నుంచి బీజేపీ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ తిరుగులేని నేతగా ఉన్నారు. అవినీతి లేకపోవడం ఆయనకు క్లీన్ ఇమేజ్ ఇస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన నేతృత్వంలోనే బీజేపీ గెలుపొందింది. 2006 నుంచి ఆయన బుధ్నీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ గెలుపొందుతున్నారు.
రాజస్థాన్:
రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ నేత, మాజీ సీఎం వసుంధర రాజేకి చెక్ పెట్టాలని చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ బీజేపీ నుంచి సీఎం అభ్యర్థి రేసులో ఈమె ముందు ఉంది.
ఇక రాజస్థాన్ ఎన్నికల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు బాబా మహంత్ బాలక్ నాథ్. అందరి కన్నా ముందు సీఎం రేసులో ఉన్నారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ లాగే బాలక్ నాథ్ ఓ యోగి. ఆయన ప్రస్తుతం అల్వార్ నుంచి ఎంపీగా ఉన్నారు. బాలక్ నాథ్ తిజారా అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ విజయం సాధించారు. అవినీతి, మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు, నేరాలు కాంగ్రెస్ పార్టీ పరాజయానికి కారణమయ్యాయి.
ఛత్తీస్‌గఢ్:
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌కే బీజేపీ తరుపున సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన మూడు సార్లు రాష్ట్రానికి సీఎంగా కొనసాగారు.
తాజావార్తలు
-
PeddiTrailer : ‘పెద్ది’ పెద్దగా మెప్పిచలేకపోయాడా? రెహమాన్ దెబ్బేసాడా?
-
MS Dhoni-IPL 2027: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ.. అసలు విషయం చెప్పేసిన సురేశ్ రైనా!
-
Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ ‘లాక్డౌన్’ లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
-
Ramayana Epic: రణ్‌బీర్ ‘రామాయణం’ కోసం హాలీవుడ్ రేంజ్ ప్లానింగ్
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!