Assam Flood: అస్సోంలో భారీ వరదలు.. నిరాశ్రయులైన 2,593 మంది
- అస్సోం రాష్ట్రంలో భారీగా వరదలు..
- జలదిగ్బంధంలోకి వెళ్లిన 671 గ్రామలు..
- ఇప్పటి వరకు నిరాశ్రయులైన 2593 మంది..
- సహాయ చర్యలు కొనసాగిస్తున్న అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam Flood: అస్సోం రాష్ట్రంలో భారీ వరదలు ముంచెత్తాయి. వరదలతో ధేమాజీలో ఆదివారం మరో ఇద్దరు మరణించారు. దీంతో, ఈ ఏడాది వరదలు, తుఫాన్, కొండ చరియలు విరిగిపడటంతో దాదాపు 44 మందికి పైగా చనిపోయారని అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాలతో దిబ్రూగఢ్ లోని బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో పాటు శివసాగర్ లోని మరో రెండు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. సోనిత్ పూర్, బార్ పేట, కరీం గంజ్ లోని నదులు ఉప్పొంగిపోయాయి. అసోంలోని 12 జిల్లాల్లో 2. 62 లక్షల మంది వరదల వల్ల ప్రభావితమైనట్లు అధికారులు చెప్పుకొచ్చారు. దాదాపు 671 గ్రామాలు జలదిగ్బంధంలోకి వెళ్లినట్లు చెప్పారు. ఇక, 2, 593 మంది నిరాశ్రయులు కాగా.. 44 సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారని స్టేట్ డిజాస్టర్ అధికారులు తెలిపారు.
Also Read
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
అయితే, పలు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. ధేమాజీ జిల్లాలో 300 మంది, టిన్సుకియాలో 20 మంది, దిబ్రూగఢ్ లో ముగ్గురిని బోట్ల ద్వారా రక్షించిట్లు అధికారులు చెప్పారు. ధేమాజీ జిల్లాలో పడవల ద్వారా దాదాపు వెయ్యి జంతువులను సైతం సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇవే కాకుండా, పలు ప్రాంతాల్లో వరదల వల్ల రోడ్లు, వంతెనలు, కట్టలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఇతర మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక, కేంద్రమంత్రి సోనోవాల్ దిబ్రూగఢ్ నియోజకవర్గంలో వరద పరిస్థితిని పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని దాటడంతో.. అక్కడ వరద పరిస్థితిని కూడా కేంద్రమంత్రి పరిశీలించారు.
తాజావార్తలు
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!