Asaduddin Owaisi: ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడి గురించి ప్రధాని మోడీకి ముందే తెలుసా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాలు కూడా యుద్ధంలోకి లాగబడ్డాయి. శనివారం ఉదయం యూఎస్ ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ పై దాడులు చేశాయి. సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఇరాన్ కూడా తీవ్రంగానే స్పందించింది. ఖతార్, సౌదీ, యూఏఈలతో పాటు మిడిల్ ఈస్ట్‌లో ఉన్న యూఎస్ మిలిటరీ స్థావరాలపై క్షిపణుల్ని ప్రయోగించింది.
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్‌బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్‌పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
ఇదిలా ఉంటే, ఈ యుద్ధంపై భారతదేశంలో రాజకీయం మొదలైంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడి చేయబోతున్నట్లు ప్రధాని నరేంద్రమోడీకి ముందే తెలుసా..? అని ప్రశ్నించారు. దాడికి ఒకరోజు ముందు ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల పాటు ఇజ్రాయిల్‌లో పర్యటించారు. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఆ దేశ పార్లమెంట్ అయిన నెస్సెట్‌లో ప్రధాని మోడీ ప్రసంగించారు.
ఈ యుద్ధం గురించి ఓవైసీ మాట్లాడుతూ.. ‘‘ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడి చేస్తుందనే సమాచారం నెతన్యాహూ ముందుగా ప్రధానికి తెలియజేశారో లేదో దేశానికి చెప్పాలి. అలా చేసి ఉంటే ప్రధాని తన పర్యటనను ముగించి దేశానికి తిరిగి రావాలి. అమెరికా సహకారంతో ఇరాన్‌పై దాడి చేస్తున్న ఇజ్రాయిల్ మనకు తెలియజేయకుంటే ఇజ్రాయిల్ మనల్ని మోసం చేసినట్లే’’ అని ఓవైసీ అన్నారు. ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో ప్రధాని మోడీ విమానం గాల్లో ఉండీ, ఇలాంటి దాడులు జరిగితే ఎవరు బాధ్యత వహించే వారు.? అని ప్రశ్నించారు. నెతన్యాహూ యుద్ధ వివరాలను ప్రధాని మోడీకి చెప్పారో లేదో దేశానికి తెలియజేయాలి. ఇరాన్‌పై దాడి చేయడానికి, గాజాలో పాలస్తీనియన్ల ఊచకోతకు ప్రధాని పర్యటనను ఉపయోగించుకున్నారని అన్నారు. దీని వల్ల భారత్ ఇరాన్‌తో కాకుండా ఇజ్రాయిల్ తో ఉందని సందేశం వస్తుందని, ఈ దాడి వల్ల భారత్‌కు ఏం లాభం ఉందని ప్రశ్నించారు.
#WATCH | Hyderabad: On Iran-Israel conflict, AIMIM chief Asaduddin Owaisi says, "If the Prime Minister's aircraft was in the air and such an attack had taken place, who would have been responsible? The Prime Minister should tell the country whether Netanyahu had informed him that… pic.twitter.com/mE3Rl1KKuD
— ANI (@ANI) February 28, 2026
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!