BJP: రాహుల్ గాంధీ భయపడ్డాడు.. అమేథీ పోటీపై బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: రాబోయే లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ రోజు 39 మందితో తొలిజాబితాను సిద్ధం చేసింది. రాహుల్ గాంధీ మరోసారి కేరళ లోని వయనాడ్ నుంచే బరిలోకి దిగబోతున్నారు. గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా ఉన్న యూపీలోని రాయ్‌బరేలీ, అమేథీ గురించి కాంగ్రెస్ రహస్యంగా వ్యవహరిస్తోంది. సోనియా గాంధీ ఈ సారి రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయబోనని ఇప్పటికే చెప్పారు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్తున్నారు.
ఇదిలా ఉంటే మరోసారి రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తుండటం కన్ఫామ్ కావడంతో అమేథీ విషయం ప్రస్తావించకపోవడం గురించి బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ నేత అమిత్ మాలవీయా దీనిపై స్పందిస్తూ.. అమేథీ స్థానం నుంచి రాహుల్ గాంధీని బరిలోకి దింపడానికి కాంగ్రెస్ భయపడింది అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘‘రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయరా.? మీరు భయపడుతున్నారా..?’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Also Read
Read Also: China: భారత సైన్యం మోహరింపుపై చైనా చిలక పలుకులు..
కాంగ్రెస్ ఉత్తర్‌ప్రదేశ్ అభ్యర్థులను దాటవేసి దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన పలు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసింది. 2019లో రాహుల్ గాంధీ అమేథీ నుంచి బీజేపీ నేత, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. 2004 నుంచి ఆయన ఇక్కడ వరసగా మూడుసార్లు గెలిచారు.
ప్రస్తుతానికి కాంగ్రెస్ మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలను వదిలిపెట్టింది. ఈ రాష్ట్రాల్లో సీట్ల షేరింగ్‌పై మిత్రపక్షాలతో చర్చిస్తోంది. మరోవైపు యూపీలో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీతో కాంగ్రెస్ సీట్ల షేరింగ్ కుదిరింది. యూపీలోని 80 స్థానాల్లో 17 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది. కాంగ్రెస్‌కి లభించిన సీట్లలో అమేథీ, రాయ్‌బరేలీ కూడా ఉన్నాయి.
తాజావార్తలు
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
-
Upasana Konidela: ‘పెద్ది’ థియేటర్లో మెగా కోడలి ఊరమాస్ రచ్చ.. చరణ్ ఎంట్రీకి పేపర్లు ఎగరేసిన ఉపాసన!
-
Hero Flex Fuel Bikes: హీరో మోటోకార్ప్ సంచలనం.. దేశంలో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్స్ స్ప్లెండర్, HF డీలక్స్ మార్కెట్లోకి..
-
Virat Kohli – Rohit Sharma: కోహ్లీ-రోహిత్‌కు అగ్నిపరీక్ష.! రాణిస్తే వరల్డ్‌కప్.. విఫలమైతే కెరియర్ ముగిసినట్లేనా?
-
China halts J10CE Delivery: భారత్ రఫేల్‌పై ఏడ్చి.. చైనా ముందు నవ్వుల పాలైన పాక్! 16 యుద్ధ విమానాల డెలివరీని ఆపేసిన చైనా..
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!