Swati Maliwal Row: స్వాతి మలివాల్‌పై దాడి విషయంలో కేజ్రీవాల్ మౌనం.. సంజయ్ సింగ్ సమాధానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swati Maliwal Row: స్వాలి మలివాల్ వ్యవహారం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని కుదిపేస్తోంది. వారం ప్రారంభంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో రాజ్యసభ ఎంపీ, మాజీ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ అయిన మలివాల్‌పై కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ దాడికి పాల్పడ్డాడు. అయితే, సహాయం కోసం ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూంకి రెండుసార్లు స్వాలిమలివాల్‌గా చెప్పబడే మహిళ ఫోన్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు స్వాతి మలివాల్ ఫిర్యాదు చేయలేదు. అయితే, ఆమెతో సెటిల్‌మెంట్ కోసం ఆప్ ప్రయత్నిస్తుందనే వాదన వినిపిస్తోంది. బుధవారం ఆమె నివాసానికి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వెళ్లడం చర్చనీయాంశం అయింది.
Read Also: Sunil Chhetri: భావోద్వేగంతో రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ భారత ఫుట్ బాల్ ప్లేయర్ సునీల్ ఛెత్రి..
Also Read
- INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
ఇదిలా ఉంటే, ఈ రోజు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో కేజ్రీవాల్ కలిసి జాయింట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్‌మీట్‌లో స్వాతి మలివాల్‌పై దాడి విషయాన్ని విలేకరులు ప్రశ్నించారు. అయితే, ఈ వ్యవహారంపై కేజ్రీవాల్ మౌనం వహించారు. దీంతో పక్కనే ఉన్న ఎంపీ సంజయ్ సింగ్ దీనికి కౌంటర్ ఇచ్చారు. మణిపూర్‌లో గిరిజన మహిళను నగ్నంగా ఉరేగించారు, బీజేపీ మిత్రపక్షానికి చెందిన ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల గురించి సంజయ్ సింగ్ తిరిగి ప్రవ్నించారు. జంతర్ మంతర్ వద్ద మహిళా రెజ్లర్లు న్యాయం కోసం పోరాడుతుంటే, అప్పటి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్, వారికి మద్దతుగా వెళ్లి, పోలీసులచే లాగబడి కొట్టబడ్డారని సంజయ్ సింగ్ అన్నారు. మహిళలపై నేరాలకు ఆ పార్టీ(బీజేపీ) మౌనానికి ఉదాహరణ అని వ్యా్ఖ్యానించారు.
‘‘ఆమ్ ఆద్మీ పార్టీ ఒక కుటుంబం. పార్టీ తన వైఖరని స్పష్టం చేసింది. నేను లేవనెత్తిన అన్ని సమస్యలపై ప్రధాని, బీజేపీ స్పందించాలని కోరుకుంటున్నాను. దయచేసి దీనిపై రాజకీయ ఆటలు ఆడొద్దు’’ అని సంజయ్ సింగ్ కోరారు. అయితే, బీజేపీ ఈ అంశంలో ఆప్‌పై విరుచుకుపడుతోంది. కేజ్రీవాల్ తన పీఏ బిభవ్ కుమార్‌ని రక్షిస్తున్నారని ఆరోపించింది. స్వాలి మలివాల్ ఎందుకు మాట్లాడటం లేదని బీజేపీ ప్రశ్నించింది. బుధవారం బీజేపీ మహిళా మోర్చా సీఎం కేజ్రీవాల్ నివాసం ముందు నిరసన వ్యక్తం చేసింది. స్వాతి మలివాల్‌పై దాడి జరిగిందనే విషయాన్ని ఆప్ పార్టీ ఒప్పుకుంది. దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పింది.
తాజావార్తలు
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు