Sunil Chhetri: భావోద్వేగంతో రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ భారత ఫుట్ బాల్ ప్లేయర్ సునీల్ ఛెత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunil Chhetri Retirement: ప్రపంచం లో అత్యధికంగా పాపులర్ అయిన ఫుట్ బాల్ భారత దేశంలో పెద్దగా ఆదరణ చూరగొనలేకపోయింది. కానీ ఫుట్ బాల్ ప్రపంచం లో ఈ భారతీయుడి పేరు తెలియని వాళ్ళు అంటూ లేరు. ఏకంగా అత్యధిక గోల్స్ చేసిన ఫుట్ బాల్ క్రీడాకారులలో క్రిస్టియానో రొనాల్డో (128), లియోనిల్ మెస్సి (106) తరువాత స్తానం ఇతని పేరు ఉంది అంటే అది భారత దేశానికే గర్వకారణం అంతటి గణతః సాధించిన టీమ్ ఇండియా కెప్టెన్ సునీల్ ఛెత్రి నేడు అంతర్జాతీయ ఫుట్ బాల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.
39 ఏళ్ల ఈ ఇండియన్ లెజెండరీ ప్లేయర్.. గురువారం (మే 16) ఓ వీడియో మెసేజ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. జూన్ 6వ తేదీన కువైట్ తో ఇండియా ఆడబోయే ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ తన చివరిదని ప్రకటించాడు. భావోద్వేగంతో ఇండియా తరఫున తాను ఆడిన తొలి మ్యాచ్ ను ఎప్పటికీ మరచిపోలేనని ఈ వీడియోలో సునీల్ ఛెత్రి చెప్పాడు. తొలి మ్యాచ్ లోనే తాను గోల్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు. తాను తొలిసారి ఇండియా జెర్సీ వేసుకునే ముందు తెలియకుండానే తాను దానిపై పర్ఫ్యూమ్ కొట్టానని కూడా చెప్పాడు. ఇప్పుడు చివరి మ్యాచ్ ఆడబోతున్న సందర్భంగా కెరీర్లో ప్రతి క్షణం గుర్తుకు వస్తోందని తెలిపాడు.
Also Read
- Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
- IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
- Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
Also Read; Virat Kohli: ఒక్కసారి వీడ్కోలు పలికితే.. నన్ను చూడలేరు.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు..
“ఈ మ్యాచ్ నాకు చివరిది అని నాకు నేను చెప్పుకున్న సమయంలో ప్రతి విషయం గుర్తుకు వచ్చింది. ఆ మ్యాచ్, ఆ కోచ్, ఈ మ్యాచ్, ఈ టీమ్.. ఇలా అన్నీ గుర్తుకు రావడం వింతగా అనిపించింది. అన్నీ గుర్తుకు వచ్చాయి. దీంతో నేను తుది నిర్ణయం తీసుకున్నాను” అని ఆ వీడియోలో సునీల్ ఛెత్రీ చెప్పాడు.
మొత్తంగా ఇప్పటి వరకూ సునీల్ ఛెత్రీ 150 అంతర్జాతీయ మ్యాచ్ లలో 94 గోల్స్ చేశాడు. అతడు జట్టులో ఉండగానే ఇండియా నెహ్రూ కప్ ను మూడుసార్లు, సాఫ్ ఛాంపియన్షిప్ మూడుసార్లు గెలిచింది. ఇక 2008లో ఏఎఫ్‌సీ ఛాలెంజ్ కప్ ఇండియా గెలవడంలోనూ ఛెత్రీదే కీలకపాత్ర. ఇతని సేవలకు మెచ్చి భారత సర్కారు అర్జున అవార్డు (2011), పద్మశ్రీ (2019), రాజీవ్ ఖేల్ రత్న (2021) అవార్డులు ఇచ్చి సత్కరించింది.
19ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో ఫుట్ బాల్ ఆటగాడిగా ఎన్నో మైలు రాళ్లు అందుకుని భారత దేశానికి గర్వకారణంగా నిలిచిన సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ తరువాత చేయబోయే ప్రతి పనిలో విజయం సాధించాలి అని కోరుకుంటూన్నాం.
తాజావార్తలు
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
-
APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?