370 ఆర్టికల్‌ను కాంగ్రెస్ పునరుద్ధరించలేదు: గులాంనబీ ఆజాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్ముకాశ్మీర్‌లో ఆర్టికల్ 370ను పునరుద్ధరించాలంటే కాంగ్రెస్ వల్ల అయ్యే పని కాదని .. ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 300 స్థానాల్లో గెలుపొందాలని, అది అసాధ్యమని అన్నారు. అధికరణ 370 రద్దుపై తన మౌనం గురించి జమ్మూ-కాశ్మీరులోని పూంఛ్ జిల్లా, కృష్ణఘాటి ఏరియాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, దీనిని కేవలం సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం మాత్రమే పునరుద్ధరించగలవని ఆయన పేర్కొన్నారు. ‘మేము సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 300 మంది ఎంపీలు అవసరం, 2024 ఎన్నికల్లో 300 మంది ఎంపీలు గెలుపొందాలి. అప్పుడే ఆర్టికల్ 370ని పునరిద్ధరించగలం. అంత మంది ఎంపీలు గెలిచేదేప్పుడు..? ప్రస్తుతం ఆ పరిస్థితి కాంగ్రెస్‌లో కనిపించడం లేదు. అందుకే అధికరణ 370ని పునరుద్ధరిస్తానని వాగ్దానం చేయలేను’ అని ఆజాద్ వ్యాఖ్యానించారు.
దీంతో కాశ్మీర్లో కాంగ్రెస్ ఓట్లను కోల్పోయే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని ఆజాద్ అన్నారు. ఇప్పటికి కాంగ్రెస్ గత వైభవాన్ని సాధించలేకుంటే ఇకపై కష్టతరంగా మారుతుందని ఆయన అన్నారు. కేవలం ఒక్క జమ్ము కాశ్మీర్ కాదు.. దేశంలో అన్ని రాష్ర్టాల్లో కాంగ్రెస్ పట్టును కోల్పోతుందని ఆజాద్ వ్యాఖ్యానించారు. దేశంలో బీజేపీని ఎదుర్కొవడానికి యూపీయే కూటమి పోరాడాల్సి ఉన్నా , ప్రస్తుత తరుణంలో ఆ పరిస్థితి కనిపించడం లేదని ఆజాద్ అన్నారు. యూపీఏ కూటమితోనే బీజేపీని ఢీకొనగలమని ఆదిశగా కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆజాద్ అన్నారు.
Also Read
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!