Congress: హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీసింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లో కూడా సరైన ప్రదర్శన చేయలేదు. నేషనల్ కాన్ఫరెన్స్ అండతో కేవలం 6 సీట్లలో మాత్రమే గెలుపొందింది. జమ్మూ కాశ్మీర్‌లో కూడా బీజేపీ సత్తా చాటింది. ఓడిపోయినప్పటికీ పార్టీ తన ఓట్లను, సీట్లను పెంచుకుంది. జమ్మూ ఏరియాలో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. మొత్తంగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ తర్వాత 29 స్థానాలు గెలిచి రెండో స్థానంలో ఉంది.