Indian Army: ‘‘ఈసారి ఆపరేషన్ సిందూర్ దారుణంగా ఉంటుంది’’.. పాక్‌కు భారత్ వార్నింగ్..
- ఆపరేషన్ సిందూర్ 2.0 మరింత తీవ్రంగా ఉంటుంది..
- పాకిస్తాన్ కు భారత సైనిక అధికారి వార్నింగ్..
Indian Army: భారత్ మరోసారి ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రారంభిస్తే ఈసారి పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని, ఆ దెబ్బ తీవ్రత మరింత గట్టిగా ఉంటుందని భారత సైనిక ఉన్నతాధికారి హెచ్చరించారు. గతేడాది పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తర్వాత భారత్ పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. పాక్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. పాక్ సైన్యం భారత్‌పై దాడి చేయడానికి ప్రయత్నిస్తే, పాక్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వైమానిక స్థావరాలను మన క్షిపణిలు ధ్వంసం చేశాయి.
Read Also: Benjamin Netanyahu: ‘‘ఇజ్రాయిలీల కళ్లు చెమ్మగిల్లాయి’’.. మోడీ ప్రసంగంపై నెతన్యాహూ భావోద్వేగం..
Also Read
“ఆపరేషన్ సిందూర్‌లో మనం చేసిన దానికంటే ప్రతిస్పందన బలంగా ఉంటుంది. మనం ఎంత స్పందిస్తాము, ఏ స్థాయికి వెళ్తాము అనేది అంతా ఆ నిర్దిష్ట రోజు మరియు ఆ నిర్దిష్ట సమయంలో ఉన్న పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. కానీ మనం గతసారి కంటే కఠినంగా స్పందించాల్సి ఉంటుందని మాకు చాలా ఖచ్చితంగా తెలుసు” అని వెస్ట్రన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ గురువారం అన్నారు.
పాకిస్తాన్ ప్రాక్సీ యుద్ధాలక పాల్పడుతోందని కటియార్ అన్నారు. పాక్ నేరుగా పోరాడలేదని, కాబట్టి వారు యుద్ధానికి తన ప్రాక్సీలను ఉపయోగిస్తున్నారని, పాక్ దుర్భలమైన బలహీన దేశమని అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కాల్పుల విరమణ కోసం మన కాళ్లపై పడ్డారని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!