కరోనా ఫస్ట్, రెండో వేవ్ దేశాన్ని ఎంతగా వణికించిందో అందరూ మర్చిపోయారు. మాస్క్‌లు ధరించకుండా బయట తిరుగుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం దేశంలో కేవలం 2శాతం మంది మాత్రమే మాస్కులు ధరిస్తున్నారని ‘లోకల్ సర్కిల్స్’ అనే సామాజిక సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇంటి నుంచి బయటకు వెళ్తున్న ప్రతి ముగ్గురులో ఒకరు మాస్కు ధరించటం లేదనిఈ సర్వే తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే మాస్క్ పెట్టుకునేవారి సంఖ్య సెప్టెంబర్‌లో 29శాతం పడిపోయిందని తెలిపింది.…