ఓ ఆపిల్ వాచ్.. ప్రమాదం నుంచి ముంబై టెక్కీ ప్రాణాలు కాపాడింది. ఇది వాస్తవం. ప్రమాదంలో ఉన్న వ్యక్తి ప్రాణాలను రక్షించింది. ఎలా? ఏంటి? తెలియాలంటే ఈ వార్త చదవండి.
26 ఏళ్ల టెక్కీ క్షితిజ్ జోడాపే ముంబై వాసి. ఈ-కామర్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 2020 నుంచి డైవింగ్ చేస్తున్న అలవాటు ఉంది. ఈ వేసవిలో పుదుచ్చేరి సమీపంలో స్కూబా డైవింగ్‌కు వెళ్లాడు. సముద్రంలో 36 కిలోమీటర్ల దూరంలో నీటి అడుగున ఉన్నప్పుడు అతడు ధరించిన పరికారాలు పనిచేయడం మానేశాయి. వెయిట్ బెల్ట్ అకస్మాత్తుగా వదులైపోయింది. వెంటనే ఉపరితలం వైపు వేగంగా పైకి లేచే ప్రయత్నం చేశాడు. దీంతో అతడి ప్రాణాలకు ముప్పు పొంచికొచ్చింది.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో కో-సింగర్ అమృత్‌ప్రవ అరెస్ట్.. ఆమె ఫోన్‌లో ఏముందంటే..!
అయితే అతడి మణికట్టుకు కట్టిన ఆపిల్ వాచ్ అల్ట్రా అకస్మాత్తుగా నిలువుగా పైకి లేవడాన్ని పసిగట్టింది. వెంటనే స్క్రీన్‌పై హెచ్చరికలు రావడం మొదలయ్యాయి. వేగంగా పైకి లేవడం కారణంగా ఊపిరితిత్తులకు తీవ్రగాయాలు అయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వేగం తగ్గించాలంటూ ఆపిల్ వాచ్ అల్ట్రా వార్నింగ్ ఇచ్చింది. ఇక పరిస్థితులు వ్యతిరేకంగా మారడంతో వెంటనే గడియారం అత్యవసర సైరన్ మోగించడం ప్రారంభించింది.
ఇది కూడా చదవండి: Udit Raj: ఆర్ఎస్ఎస్ ఉగ్ర సంస్థ.. మోడీ ఆధునిక రావణుడు.. కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు
అయితే నీటి అడుగున వినిపించే శబ్దాలకు భిన్నంగా సైరన్ సౌండ్ వినిపించడంతో డైవింగ్ బోధకుడు అప్రమత్తం అయ్యాడు. వెంటనే క్షితిజ్‌కు సాయం చేసేందుకు అతడి దగ్గరకు ఈదుకుంటూ వచ్చాడు. చాకచక్యంగా క్షితిజ్ ప్రాణాలు కాపాడాడు. అయితే క్షితిజ్ ధరించిన గడియారంలో అలాంటి లక్షణం ఉందన్న విషయం అతడికి కూడా తెలియదు. తాను ప్రమాదాన్ని గ్రహించేలోపే సైరన్ మోగిందని.. వెంటనే సహాయకుడు వచ్చి ప్రాణాలు కాపాడినట్లు క్షితిజ్ చెప్పుకొచ్చాడు.
అయితే క్షితిజ్‌కు ఎదురైన అనుభవాన్ని ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌కు లేఖ ద్వారా తెలియజేశాడు. దీనికి ప్రతి స్పందనగా కుక్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సైరన్ విని డైవింగ్ బోధకుడు స్పందించి మీకు త్వరగా సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు చెప్పారు. క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఆపిల్ వాచ్ అల్ట్రా..
ఆపిల్ వాచ్ అల్ట్రా ఎమర్జెనీ సైరన్‌తో సహా అనేక భద్రతా లక్షణాలతో రూపొందించారు. ఈ సైరన్ హై పిచ్ శబ్దాలను విడుదల చేస్తుంది. దాదాపు 180 కిలోమీటర్ల దూరం వరకు ఈ శబ్దం వినవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో పర్యావరణ శబ్దాన్ని తగ్గించడానికి ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు.