Neha Murder Case: ‘‘ నా కొడుకును శిక్షించండి’’.. ఫయాజ్ తండ్రి క్షమాపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Neha Murder Case: కర్ణాటక హుబ్బళ్లిలో కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహా హత్య కేసు సంచలనంగా మారింది. ఈ హత్య రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ఫస్ట్ ఇయర్ ఎంసీఏ స్టూడెంట్ నేహా(22)ని ఫయాజ్(23) అనే వ్యక్తి అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన కాలేజ్ క్యాంపస్‌లోనే చోటు చేసుకుంది. దీనిపై బీజేపీ, అధికార కాంగ్రెస్ పార్టీని నిందిస్తోంది. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని బీజేపీ మండిపోడుతోంది, అంతే కాకుండా ఈ హత్యలో ‘లవ్ జిహాద్’ కోణం ఉన్నట్లు ఆరోపించింది. అయితే, ఇది వ్యక్తిగత విషయమని, ఇందులో లవ్ జిహాద్ కోణం లేదని చెప్పింది. అయితే, నేహా తండ్రి నిరంజన్ హిరేమత్ కూడా తన బిడ్డను ట్రాప్ చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించారు.
Read Also: Shriya Saran: శ్రీయ అందాలకి కుర్రకారు ఫిదా…
Also Read
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ఇదిలా ఉంటే ఈ హత్యపై నిందితుడు ఫయాజ్ తండ్రి స్పందించారు. నేహను చంపిన తన కుమారుడిని కఠినంగా శిక్షించాలని కోరాడు. పాఠశాల ఉపాధ్యాయుడైన ఫయాజ్ తండ్రి బాబా సాహెబ్ సుబానీ శనివారం మీడియాలో మాట్లాడుతూ.. గురువారం సాయంత్రం 6 గంటల కు తనకు సంఘటన గురించి తెలిసిందని, తన కుమారుడి చర్యతో దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. ‘‘భవిష్యత్తులో ఇలాంటి పనిచేయడానికి భయపడే విధంగా అతని శిక్ష ప డాలి. నేహా కుటుంబాన్ని చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నా. ఆమె నా కూతురు లాంటిది’’ అని కన్నీటి పర్యంతమయ్యారు. గత ఆరేళ్లుగా తాను, తన భార్య వేరువేరుగా ఉంటున్నామని, ఫయాజ్ తల్లి దగ్గరే ఉంటున్నాడని, 3 నెలల క్రితం చివరిసారిగా తన కొడుకుతో మాట్లాడినట్లు వెల్లడించారు.
8 నెలల క్రితం నేహా కుటుంబం తనకు ఫోన్ చేసి తన కుమారుడు, నేహాను వేధిస్తున్నట్లు ఫోన్ చేసి చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. తన కొడుకు తప్పు చేశాడని ఒప్పుకుంటూనే.. ఫయాజ్, నేహ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని, రిలేషన్ షిప్‌లో ఉన్నారని చెప్పాడు. ఫయాజ్ ఆమెను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాడని, కానీ నేను దానికి నిరాకరించానని నిందితుడి తండ్రి అన్నారు. ‘‘ మహిళలపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు. నన్ను క్షమించాలని కర్ణాటక ప్రజల్ని అభ్యర్థిస్తున్నాను.’’ అని అన్నారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని అప్పుడే తమ కుమార్తె ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!