Rajasthan CM: రాజస్థాన్‌లో కూడా సర్ప్రైజ్ తప్పదా..? సీఎం రేసులో ఉంది వీరే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan CM: ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ సీఎం అభ్యర్థుల ఎన్నికలో బీజేపీ అందరిని ఆశ్యర్యానికి చేసింది. ఇప్పటికే ఛత్తీస్గడ్కి విష్ణదేవ్ సాయ్, ఎంపీకి మోహన్ యాదవ్‌లను సీఎంగా ప్రకటించింది. అయితే ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రానికి సీఎంగా కొత్తవారిని ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమవుతోందని సమాచారం. ఇక్కడ కూడా బీజేపీ బిగ్ సర్ప్రైజ్ ఇస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు శాసనపక్ష నేతను బీజేపీ ఎమ్మె్ల్యేలు ఎన్నుకోబోతున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వసుంధర రాజేని సీఎంగా చేస్తారా..? లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ కేంద్ర పరిశీలకులుగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఇద్దరు సహ పరిశీలకులు, జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, జాతీయ ఉపాధ్యక్షురాలు సరోజ్ పాండే సమక్షంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే భజన్‌లాల్ శర్మ తెలిపారు. కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రకటించే సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలందరూ హాజరు కావాలని కోరినట్లు ఆయన తెలిపారు.
Also Read
- AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
- Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రేసులో ఉంది వీరే..
కేంద్రమంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, గజేంద్ర సింగ్ షెకావత్, అశ్విని వైష్ణవ్లతో పాటు వసుంధర రాజే సీఎం రేసులో ముందు వరసలో ఉన్నారు. వీరితో పాటు జైపూర్ రాజకుటుంబానికి చెందిన దియా కుమారి, రాష్ట్ర బీజేపీ చీఫ్ సీపీ జోషి, సీనియర్ నేత కిరోడి లాల్ మీనా, బాబా బాలక్ నాథ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే శాసన సభ పక్ష సమావేశానికి ముందుగా కొత్తగా ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు వసుంధర రాజేని కలుసుకున్నారు. ఆదివారం కూడా దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు ఆమె నివాసానికి వెళ్లారు.
Read Also: PM Modi: కాంగ్రెస్ ‘మనీ హీస్ట్’.. 70 ఏళ్లుగా దోచుకుంటోంది..
రెండు రాష్ట్రాల్లో అనూహ్య నిర్ణయాలు:
బీజేపీ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఎవరూ ఊహించని విధంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గిరిజన నాయకుడు విష్ణుదేవ్ సాయ్‌ని ముఖ్యమంత్రిగా నిర్ణయించారు. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన రమణ్ సింగ్‌ని కాదని ఆయను సీఎం చేయడం అందర్ని ఆశ్చర్యపరిచింది. రేపు ఈ రెండు రాష్ట్రాలు వారు ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రజాధరణ కలిగిన నేత, నాలుగు పర్యాయాలుగా సీఎంగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ని కాదని బీజేపీ మాజీ క్యాబినెట్ మంత్రి మోహన్ యాదవ్‌ని సీఎంగా ఎంచుకుంది. చౌహాన్ సంక్షేమ పథకాలు, జనాధరణతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ సంచలన విజయం సాధించింది.
తాజావార్తలు
-
HYDRA Operation: హస్మత్‌పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
-
Smartphone Theft: ఫోన్ పోయిందా? మొదటి 15 నిమిషాల్లో ఈ పనులు చేయకపోతే డేటా, డబ్బు రెండూ పోవచ్చు
-
Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
-
Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!