AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AIADMK MLA Resignation: తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకేకు మరో భారీ రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. కరూర్ ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ సోమవారం తమిళనాడు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు పార్టీకి కూడా గుడ్‌బై చెప్పారు. 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏఐఏడీఎంకేను వీడిన ఆరో ఎమ్మెల్యేగా ఆయన నిలిచారు. ఈ పరిణామం పార్టీ అధినేత పళనిస్వామికి మరింత ఇబ్బందికరంగా మారింది.
జయలలిత మంత్రివర్గంలో కీలక బాధ్యతలు
ఎంఆర్ విజయభాస్కర్ మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేత వి. సెంథిల్ బాలాజీ చేతిలో ఓడిపోయిన ఆయన, 2026 ఎన్నికల్లో తిరిగి కరూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే, 2026 ఎన్నికల అనంతరం ఏఐఏడీఎంకే నుంచి ఎమ్మెల్యేల నిష్క్రమణలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి అధికార టీవీకేలో చేరగా, ఇటీవల పార్టీని వీడిన విరాలిమలై మాజీ ఎమ్మెల్యే సి. విజయభాస్కర్ కూడా త్వరలో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకేలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామా
ఎంఆర్ విజయభాస్కర్‌కు ముందు అంబాసముద్రం ఎమ్మెల్యే ఈశక్కి సుబయ్య, ధారాపురం ఎమ్మెల్యే పి. సత్యభామ, మదురాంతకం ఎమ్మెల్యే మరగతం కుమరవేల్, పెరుందురై ఎమ్మెల్యే ఎస్. జయకుమార్, విరాలిమలై ఎమ్మెల్యే సి. విజయభాస్కర్‌లు కూడా పార్టీకి, అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండటంతో అసెంబ్లీలో ఏఐఏడీఎంకే బలం తగ్గడంతో పాటు పార్టీ భవిష్యత్తుపై కూడా చర్చ మొదలైంది.
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!