Anna Hazare: లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు క్లీన్‌చిట్‌పై అన్నాహజారే కీలక వ్యాఖ్యలు
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ క్లీన్చిట్
- కోర్టు తీర్పుపై స్పందించిన అన్నాహజారే
- మీడియా ముఖంగా కేజ్రీవాల్‌కు కీలక సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సహా మరో 21 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఢిల్లీ కోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ అంశంపై అన్నా హజారే స్పందించారు. న్యాయవ్యవస్థ తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. తీర్పును స్వాగతిస్తున్నామని… న్యాయవ్యవస్థ అత్యున్నతమైనది కాబట్టి తీర్పును అంగీకరించాల్సిందేనని పేర్కొన్నారు.
‘‘మన దేశం న్యాయవ్యవస్థపై నడుస్తుంది. దేశంలో న్యాయ వ్యవస్థ అత్యున్నత వ్యవస్థ. మనది అనేక రాజకీయ పార్టీలు, కులాలు, మతాలతో కూడిన పెద్ద దేశం. అయినప్పటికీ న్యాయ వ్యవస్థ కారణంగా అది సరిగ్గా నడుస్తోంది.’’ అని అన్నా హజారే మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలోని తన స్వగ్రామం రాలేగాన్ సిద్ధిలో మాట్లాడారు.
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
కేజ్రీవాల్ కు ఇప్పుడు ఏమి సలహా ఇవ్వాలనుకుంటున్నారని అడిగినప్పుడు.. ‘‘సమాజం కోసం… దేశం కోసం పని చేయండి. మీ గురించి లేదా పార్టీ గురించి ఆలోచించకండి..’’ అని సూచించారు. బలమైన జన లోక్‌పాల్ బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 2011లో జరిగిన ‘ఇండియా అగైన్స్ట్ కరప్షన్’ ఉద్యమంలో హజారే, కేజ్రీవాల్, సిసోడియా కీలక వ్యక్తులుగా ఉన్నారు. ఆ ఉద్యమం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని కుదిపేసింది.
ఢిల్లీ పాలసీ కేసులో మార్చి 21, 2024న కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. 155 రోజులు జైల్లో ఉన్న తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. జైల్లో ఉన్నంత కాలం ముఖ్యమంత్రిగా కొనసాగి.. విడుదలయ్యాక రాజీనామా చేశారు. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాక అన్నా హజారే మాట్లాడుతూ.. జన్ లోక్‌పాల్ ఉద్యమంలో భాగమైన వ్యక్తిని అవినీతి కేసులో అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేజ్రీవాల్ కోట్లాది మంది దేశవాసుల నమ్మకాన్ని మోసం చేశారని, రాజకీయ ఆశయాలు 2011 అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని నాశనం చేశాయని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Bhadradri Kothagudem: ఇంటర్ పరీక్షా కేంద్రంలోని టాయ్లెట్లో.. మృత శిశువుకు జన్మనిచ్చిన ఫస్ట్ ఇయర్ విద్యార్థిని
తాజావార్తలు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!