Anand Mahindra Tweet: మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు.. క్రమంగా తన బిజినెస్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే.. తన సోషల్ మీడియా యాండిల్ ద్వారా.. ఎప్పటికప్పుడు.. ఎన్నో విషయాలను షేర్ చేస్తూ వస్తున్నారు.. కొన్ని నవ్విస్తే.. మరికొన్ని ఆలోచింపజేస్తాయి.. ఇంకొన్ని కొత్త టాలెంట్‌ను వెలికితీస్తాయి.. మరికొన్ని కొత్త ఆవిష్కరణలను పరిచయం చేస్తాయి.. ఇలా ఎన్నో విషయాలను షేర్ చేస్తూ.. తన ఫాలోవర్లను ఆకట్టుకుంటారు.. ఆయనను ఏకంగా 10.2 మిలియన్ల మంది ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారంటే.. ఆయన షేర్ చేసే విషయాలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.. శుక్రవారం, మహీంద్రా ఫ్లాష్‌బ్యాక్ వీడియోను పంచుకున్నారు, 1980లు మరియు 1990లలోని జీవిత సారాంశాన్ని వీడియో రూపంలో ట్విట్టర్ చేసి.. ఎంత అద్భుతమైన జీవన ప్రయాణం.. ఎక్కడి నుంచి ఎక్కడికో ఎదిగిపోయాం.. ఒకవేళ ఎవరైనా వీటన్నింటినీ సేకరించి.. మ్యూజియంలో భద్రపరిస్తే ఎంత బాగుంటుందో కదా.. అంటూ కామెంట్ పెట్టారు..
Read Also: Veera Simha Reddy Trailer: ట్రైలర్ తోనే హిట్ కొట్టిన బాలయ్య.. థియేటర్ దబిడిదిబిడే
ఇక, మహీంద్రా షేర్ చేసిన ఆ వీడియోలో 1980, 1990 కాలంలో ఉపయోగించిన టెలిఫోన్‌లు, స్కూటర్‌లు, ఆయిల్ ల్యాంప్స్, పెట్రోమ్యాక్స్ లాంతర్లు, రోటరీ డయల్ ఫోన్‌లు, బొగ్గు ఇస్త్రీ పెట్టె, టార్చ్, స్టవ్, క్యాసెట్‌లు, క్యాసెట్ ప్లేయర్‌లు, టైప్‌రైటర్‌లు, రేడియోలు, పేపర్ ప్రకటనలు, ఆ కాలం నాటి లక్స్ సబ్బు యాడ్‌లు, చార్మినార్ సిగరెట్ పెట్టె కోసం చేసే ప్రకటన, వహీదా రెహ్మాన్, మధుబాల, పద్మినిల ఫిల్మ్‌ఫేర్ యాడ్స్ ఫొటోలు, అమితాబ్ బచ్చన్ యంగ్‌గా ఉన్న సమయంలో.. బాంబే డైయింగ్ ప్రకటనకు సంబంధించిన ఫొటో.. ఇలా చాలా అంశాలు మహీంద్రా షేర్ చేసిన వీడియోలు కనిపిస్తున్నాయి.. ఇక, ఆ వీడియో క్లిప్‌కి లతా మంగేష్కర్ పాడిన గుజ్రా హువా జమానా ఆతా నహిన్ పాట కూడా జోడించారు.. ఇక, ఈ వీడియో షేర్ చేసినప్పట్టి నుంచి ఇప్పటి వరకు 520.3కే వ్యూస్ సాధించగా.. 1398 మంది రీట్వీట్ చేశారు.. దాదాపు 10 వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు.. మొత్తంగా మరోసారి ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్‌గా మారిపోయింది.
What a great journey down memory lane! Wonder if someone has collected these actual physical objects and displayed them in a museum? I think GenZ would enjoy seeing them…A kind of dinosaur museum 😊 pic.twitter.com/x8w2Row82E
— anand mahindra (@anandmahindra) January 6, 2023