UtterPradesh: సహజంగా ఇంట్లో ఉండే అత్త, కోడళ్లు గొడవ పడుతుంటారు. వారి గొడవకు కారణాలు పెద్దగా ఉండకపోవచ్చు. అత్త, కోడళ్ల మధ్య గొడవలు సర్వసాధారణం. అయితే ఈ గొడవలు కాస్త ఎక్కువగా ఉంటే రెండు కుటుంబాల పెద్దలు కూర్చుని మాట్లాడుకొని సమస్యలు లేకుండా చూసుకుంటారు. లేదంటే ఇద్దరిలో ఎవరో ఒకరు సర్ధుకుపోతారు. కానీ ఇక్కడ ఇంటి పనులు సరిగా చేయడం లేదని.. ఇంటిని సరిగా పట్టించుకోవడం లేదని కోడలిని తుపాకీతో కాల్చి చంపిందో అత్త, కోడలిని కాల్చిన తరువాత ఆ తుపాకి దొరకకుండా డ్రైనేజ్‌లో పడేసింది అత్త. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో జరిగింది.
Read also: Naukri.com: భారతీయ ఉద్యోగులకు 10శాతం ఇంక్రిమెంట్.. సర్వేలో వెల్లడి
ఇంటి పనుల పట్ల నిర్లక్ష్యం వహించిందనే కోపంతో కోడలిని అత్త తుపాకీతో కాల్చి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటి పనుల పట్ల నిర్లక్ష్యంగా ఉందని కోమల్‌పై ఆమె అత్త తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండేంది. పలుమార్లు హెచ్చరించి సహనం కోల్పోయిన అత్త బుధవారం కోడలు కోమల్ ఇంట్లో నిద్రిస్తుండగా తుపాకీతో ఆమె తలపై కాల్చింది. దీంతో కోమల్ నిద్రలోనే అనంతలోకాలకు వెళ్లింది. కాల్పులు జరిగిన సమయంలో అత్త కోడలు తప్ప ఇంట్లో ఎవరూ లేరు. హత్య అనంతరం పోలీసులకు దొరకకుండా ఉండడానికి తుపాకీని డ్రైనేజీలో పడేసింది అత్త. దొంగలు ఇంటిని దోచుకోవడానికి ప్రయత్నించారని, అడ్డుకోబోయిన కోమల్‌ను కాల్చి చంపారని నమ్మించే ప్రయత్నం చేసింది. సాక్ష్యంగా చూపెట్టడం కోసం ఇంటిని చిందరవందర చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.
Read also: Hyderabad: హైదరాబాద్ లో పంది కొవ్వుతో వంట నూనె తయారు..
వరకట్నం, కులం విషయంలో కూడా కుటుంబంలో తరచుగా గొడవలు జరుగుతుండేవని స్థానికుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. దీనికి తోడు ఇంటి పనుల పట్ల నిర్లక్ష్యం వహించడం కూడా అత్తకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ నేపథ్యంలోనే కోమల్‌ను అత్త కాల్చిచంపినట్లు తేల్చారు. డ్రైనేజీలో పడేసిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలి అత్త, భర్త, మామను అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై హత్య, వరకట్న వేధింపులకు సంబంధించిన సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.