Amit Shah: బీజేపీ అధికారంలోకి వస్తే మమత గూండాలను తలక్రిందులుగా వేలాడదీస్తాం

  • మమతా బెనర్జీ ప్రభుత్వంపై అమిత్ షా ఫైర్
  • మమత గూండాలను తలక్రిందులుగా వేలాడదీస్తాం
  • ఈసారి ఇంటికెళ్లడం ఖాయమని వార్నింగ్
Amitshah (2)

Amitshah (2)

బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే మమతా బెనర్జీ గూండాలను తలక్రిందులుగా వేలాడదీస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణ 24 పరగణాలు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

ఇది కూడా చదవండి: Iran-Israel war: నెతన్యాహు కార్యాలయం ధ్వంసం.. ఇజ్రాయెల్ ప్రధానిపై ఇరాన్ సంచలన ప్రకటన

‘‘పంచాయతీ ఎన్నికల్లో మా కార్యకర్తలపై దాడి జరిగింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది వికలాంగులయ్యారు. చాలామంది ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. మమతా బెనర్జీ.. మీ దాడికి బీజేపీ భయపడుతుందని మీరు అనుకుంటున్నారా? దానిని భరించే శక్తి మాకు ఉంది. కానీ ఈ రోజు నేను మధురపూర్ ప్రజలకు చెబుతున్నా. బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురండి.. మేము మమతా బెనర్జీ గూండాలను తలక్రిందులుగా వేలాడదీసి సరిదిద్దుతాం. మేము ప్రతి ఒక్కరినీ గుర్తించి కటకటాల వెనుక పడేస్తాం.’’ అని వార్నింగ్ ఇచ్చారు.

‘‘బెంగాల్‌లో ఓటు బ్యాంకు అంతా చొరబాటుదారులతో నింపారు. బుజ్జగింపు తప్ప.. మమత ఏమీ చేయలేదు. ఇప్పుడు వారు ఆలయం నిర్మించాలని ఆలోచన చేస్తున్నారు. మేము రామమందిరాన్ని నిర్మించాం. మేము కాశీ విశ్వనాథ్ కారిడార్, మహాకాల్ కారిడార్‌ను నిర్మించాం. ఆ సమయంలో మీరు ఏమీ చేయలేదు. ఇప్పుడు మీరు ఆలయం నిర్మించాలనుకుంటున్నారు. ఇప్పటికే బెంగాల్ ప్రజలు మీ వల్ల మోసపోయారు. కానీ దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం వేరే ఉన్నప్పటికీ ఆలయ నిర్మాణాన్ని నేను స్వాగతిస్తున్నాను.’’ అని అన్నారు.

‘‘బెంగాల్‌లో మళ్లీ బాబ్రీ మసీదును నిర్మిస్తున్నారు. ఎవరిది బాధ్యత?… బాబ్రీ మసీదును మళ్లీ నిర్మించాలా… హుమాయున్ కబీర్.. మమత ఒక్కటే. హిందువులు కోపంగా ఉండకుండా హుమాయున్ కబీర్‌ను పార్టీ నుంచి బయటకు పంపించి బాబ్రీ మసీదును నిర్మించడానికి మమతా బెనర్జీ కుట్ర పన్నారు. మమతా మీరు చింతించకండి. ఈ రాష్ట్రంలోని హిందువులు, ముస్లింలకు మీ గురించి బాగా తెలుసు. ఈసారి ఇంటికి వెళ్లడానికి సమయం ఆసన్నమైంది.’’ అని అమిత్ షా హెచ్చరించారు.