Amit Shah: బీజేపీ అధికారంలోకి వస్తే మమత గూండాలను తలక్రిందులుగా వేలాడదీస్తాం
- మమతా బెనర్జీ ప్రభుత్వంపై అమిత్ షా ఫైర్
- మమత గూండాలను తలక్రిందులుగా వేలాడదీస్తాం
- ఈసారి ఇంటికెళ్లడం ఖాయమని వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే మమతా బెనర్జీ గూండాలను తలక్రిందులుగా వేలాడదీస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణ 24 పరగణాలు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ఇది కూడా చదవండి: Iran-Israel war: నెతన్యాహు కార్యాలయం ధ్వంసం.. ఇజ్రాయెల్ ప్రధానిపై ఇరాన్ సంచలన ప్రకటన
Also Read
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
‘‘పంచాయతీ ఎన్నికల్లో మా కార్యకర్తలపై దాడి జరిగింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది వికలాంగులయ్యారు. చాలామంది ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. మమతా బెనర్జీ.. మీ దాడికి బీజేపీ భయపడుతుందని మీరు అనుకుంటున్నారా? దానిని భరించే శక్తి మాకు ఉంది. కానీ ఈ రోజు నేను మధురపూర్ ప్రజలకు చెబుతున్నా. బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురండి.. మేము మమతా బెనర్జీ గూండాలను తలక్రిందులుగా వేలాడదీసి సరిదిద్దుతాం. మేము ప్రతి ఒక్కరినీ గుర్తించి కటకటాల వెనుక పడేస్తాం.’’ అని వార్నింగ్ ఇచ్చారు.
‘‘బెంగాల్‌లో ఓటు బ్యాంకు అంతా చొరబాటుదారులతో నింపారు. బుజ్జగింపు తప్ప.. మమత ఏమీ చేయలేదు. ఇప్పుడు వారు ఆలయం నిర్మించాలని ఆలోచన చేస్తున్నారు. మేము రామమందిరాన్ని నిర్మించాం. మేము కాశీ విశ్వనాథ్ కారిడార్, మహాకాల్ కారిడార్‌ను నిర్మించాం. ఆ సమయంలో మీరు ఏమీ చేయలేదు. ఇప్పుడు మీరు ఆలయం నిర్మించాలనుకుంటున్నారు. ఇప్పటికే బెంగాల్ ప్రజలు మీ వల్ల మోసపోయారు. కానీ దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం వేరే ఉన్నప్పటికీ ఆలయ నిర్మాణాన్ని నేను స్వాగతిస్తున్నాను.’’ అని అన్నారు.
‘‘బెంగాల్‌లో మళ్లీ బాబ్రీ మసీదును నిర్మిస్తున్నారు. ఎవరిది బాధ్యత?… బాబ్రీ మసీదును మళ్లీ నిర్మించాలా… హుమాయున్ కబీర్.. మమత ఒక్కటే. హిందువులు కోపంగా ఉండకుండా హుమాయున్ కబీర్‌ను పార్టీ నుంచి బయటకు పంపించి బాబ్రీ మసీదును నిర్మించడానికి మమతా బెనర్జీ కుట్ర పన్నారు. మమతా మీరు చింతించకండి. ఈ రాష్ట్రంలోని హిందువులు, ముస్లింలకు మీ గురించి బాగా తెలుసు. ఈసారి ఇంటికి వెళ్లడానికి సమయం ఆసన్నమైంది.’’ అని అమిత్ షా హెచ్చరించారు.
#WATCH | South 24 Parganas, West Bengal: Union Home Minister Amit Shah says, "In the panchayat elections, hundreds of our activists were attacked. Many people lost their lives. Many became handicapped. Many have not returned home yet. Mamata Banerjee, do you think that the BJP… pic.twitter.com/dRZyKdt33h
— ANI (@ANI) March 2, 2026
#WATCH | South 24 Parganas, West Bengal: Union Home Minister Amit Shah says, "They filled Bengal with infiltrators because they see their vote bank in it. apart from appeasement, Didi does nothing. Now they are thinking of building a temple. Mamata Didi, we have built the Ram… pic.twitter.com/4jsvAvzjJN
— ANI (@ANI) March 2, 2026
తాజావార్తలు
-
KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్!
-
Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!