Tomato Price Hike: టమాటా ధరలు రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా టమాటాకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. ఏకంగా కిలో టమాటా ధర రూ. 100ను దాటేసింది. దీంతో సామాన్యుడు టమాటా కొనే పరిస్థితి లేదు. ప్రకృతి అననుకూల పరిస్థితులు పంటపై తీవ్ర ప్రభావం చూపించడంతో దిగుబడి తగ్గింది. దీంతో డిమాండ్ పెరిగి.. టమాటా ధరలు చుక్కలనంటాయి.
Read Also: Maharashtra Bus Fire: ఈ 8 మంది మృత్యుంజయులు.. బస్సు ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డారంటే..?
ఈ పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచనలో ముందుకు వచ్చింది. ‘‘ టమాటా గ్రాండ్ ఛాలెంజ్(TGC) హ్యాకథాన్’’పేరుతో ఆలోచనను మంగళవారం అధికారికంగా ప్రకటించిది. టమాటాను అందుబాటులో ఉంచేందుకు, వాటి లభ్యతను నిర్థారించే ఉద్దేశంతో దీన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. టమాటా ధరలను తగ్గించేందుకు వినూత్న ఆలోచనలను సూచించాలని కోరింది. ఈ గ్రాండ్ ఛాలెంజ్ లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, రీసెర్చ్ స్కాలర్లు, పరిశ్రమలు, స్టార్టప్స్, నిపుణులు, మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSMEలు)ఇలా ఎవరైనా పాల్గొనవచ్చు. ఎలాంటి పద్దతుల్లో ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు, పంటను ఏలా సరఫరా చేయవచ్చు వంటి అంశాలతో పాటు విత్తనాలు వేసినప్పటి నుంచి పంట వినియోగదారుడికి చేరే వరకు టమాటా సాగులో ఆయా దశల్లో సలహాలు ఇవ్వచ్చు వీటిని మెరుగైన సూచనలను ఎంపిక చేస్తారు.
విద్యామంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్ సహాకారంతో వినియోగదారుల వ్యవహారాల శాఖ దీన్ని రూపొందించింది. ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారు https://doca.gov.in/gtc/index.php. అధికార వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సారి రుతుపవనాలు ఆలస్యంగా రావడం, అంతకుముందు తీవ్రమైన వేడి ప్రభావం వల్ల టమాటా పంట దెబ్బతింది. దీనికి తోడు కర్ణాటక ప్రాంతంలో భారీగా వర్షాలు కురవడం కూడా పంట దిగుబడిని తగ్గించింది. దీంతో డిమాండ్ కు తగిన సప్లై లేకపోవడంతో ధరలు సెంచరీని దాటాయి.