Rahul Gandhi: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్ పోటీపై కొనసాగుతోన్న సందిగ్ధత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలకు మరికొన్ని రోజులు మిగిలి ఉండగా.. రాహుల్ గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 మధ్య ఎన్నికలు జరుగుతాయని పార్టీ ప్రకటించింది, అయితే అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ రాహుల్ గాంధీ ఇప్పటి వరకు వైఖరిని క్లియర్ చేయలేదు.కాంగ్రెస్ వ్యూహకర్తలు ఇప్పటివరకు రాహుల్ గాంధీని అధ్యక్ష పదవికి పోటీ చేసేలా ఒప్పించడంలో విఫలమయ్యారు. దీనివల్ల కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. రాహుల్ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో ఎలాంటి స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేదు. రాహుల్ గాంధీ నుండి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో ఎన్నికల తేదీని లాక్ చేయాల్సిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించకపోవడం గమనార్హం.
సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఆఫ్ కాంగ్రెస్ ప్రకారం.. పార్టీ ఎన్నికలకు సన్నాహాలు పూర్తిచేసింది. మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలోని అథారిటీ ఎన్నికలకు సకాలంలో సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఇప్పుడు ఎన్నికల తేదీలను ప్రకటించడానికి బంతి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కోర్టులో ఉంది.రాష్ట్రాలలో ఎన్నికల ప్రక్రియ ఇంకా పూర్తి కానప్పటికీ, తాము షెడ్యూల్‌కు కట్టుబడి ఉంటామని.. ఎన్నికల షెడ్యూల్ కోసం సీడబ్ల్యూసీ తుది పిలుపునిస్తుందని మధుసూదన్ మిస్త్రీ అన్నారు. అన్ని రాష్ట్రాల నుండి 9,000 మందికి పైగా ప్రతినిధులు ఎన్నికల్లో పాల్గొంటారన్నారు.
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
Rajasthan: దళిత బాలుడి హత్య.. రాజస్థాన్‌లో రాజకీయ ప్రకంపనలు
పార్టీ ప్రకటించిన ప్రకారం.. ఆగస్టు 21న కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. సెప్టెంబర్ 20లోపు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది. రాష్ట్రాల అధ్యక్షులను కూడా ఆగస్టు 20 నాటికి ఎన్నుకోవాలి. ఇప్పటివరకు ఈ ప్రక్రియ ఏ రాష్ట్రంలోనూ పూర్తి కాలేదు. రాహుల్ గాంధీ వైఖరిపై స్పష్టత లేకపోవడంతో నాయకత్వం అయోమయంలో పడిందని, ఎన్నికల నాటికి ఇది పూర్తవుతుందా లేదా అనే సందేహంలో పార్టీ ఉన్నట్లు సమాచారం.సెప్టెంబరు 7న కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించనుండగా, యాత్ర సుదీర్ఘంగా సాగుతుందని, అప్పటికి ఎన్నికలు నిర్వహించకుంటే మరింత జాప్యం జరిగే అవకాశం ఉందన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ అంతర్గత ఎన్నికలు వాయిదా పడ్డాయి. రాహుల్ గాంధీ నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి ఇష్టపడని పక్షంలో అశోక్ గెహ్లాట్, మల్లికార్జున్ ఖర్గే, ముకుల్ వాస్నిక్, కుమారి శైలజా, కేసీ వేణుగోపాల్ వంటి పేర్లను పరిగణనలోకి తీసుకోవచ్చు. అయితే ఇలా జరిగేందుకు చాలా తక్కువ అవకాశాలే ఉన్నాయి. ఒకవేళ రాహుల్ అంగీకరించకపోతే సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!