Bengaluru: ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఏం జరిగిందంటే..!
- ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం
- బెంగళూరులో ల్యాండింగ్ సమయంలో టెయిల్ స్ట్రైక్
- క్షేమంగా బయటపడ్డ ప్రయాణికులు, సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ నుంచి బెంగళూరు వస్తున్న ఎయిరిండియాకు పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో టెయిల్ స్ట్రైక్‌కు గురైంది. అనంతరం విమానాన్ని తక్షణమే గ్రౌండ్ చేశారు. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఎయిరిండియా AI2651 విమానం ఢిల్లీ నుంచి బెంగళూరుకు వచ్చింది. విమానం బెంగళూరులో ల్యాండింగ్ సమయంలో ‘టెయిల్ స్ట్రైక్’కు చోటుచేసుకున్నట్లు ఎయిరిండియా సంస్థ తెలిపింది. అంటే విమానం వెనుక భాగం రన్‌వేపై తగిలినట్లు అర్థం. ఈ ఘటన తర్వాత విమానాన్ని పూర్తి స్థాయి సాంకేతిక తనిఖీల కోసం సేవల నుంచి తప్పించారు. విమానంలో మొత్తం 179 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు సమాచారం. అందరినీ సురక్షితంగా విమానం నుంచి దించేశారు. ఇక బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది. బెంగళూరులోని గ్రౌండ్ సిబ్బంది అవసరమైన సహాయం అందిస్తున్నారని తెలిపింది.
Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
ఈ ఘటనపై ఎయిరిండియా అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ‘‘ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే మా మొదటి ప్రాధాన్యత’’ అని పేర్కొన్నారు. అలాగే నియమావళి ప్రకారం సంబంధిత నియంత్రణ సంస్థలతో కలిసి ఈ ఘటనపై దర్యాప్తు చేపడతామని వెల్లడించారు.
టెయిల్-స్ట్రైక్ అంటే ఏమిటి?
ల్యాండింగ్ లేదా టేకాఫ్ సమయంలో విమానం తోక భాగం రన్‌వేను తాకడాన్ని టెయిల్-స్ట్రైక్ అంటారు. సాధారణంగా ల్యాండింగ్ సమయంలో విమానం మరీ ఎక్కువగా పైకి వంగినప్పుడు లేదా సమతుల్యత కోల్పోయినప్పుడు ఇది జరుగుతుంది. ఈ సంఘటన విమానానికి నష్టం కలిగించగలదు. ప్రమాదకరమైనది కూడా. అందువల్ల ఇటువంటి సందర్భాల్లో విమానానికి క్షుణ్ణమైన సాంకేతిక తనిఖీ అవసరం.
An Air India spokesperson says, "Flight AI2651 operating from Delhi to Bengaluru on 21 May experienced a tail-strike during landing. The aircraft landed safely, and all passengers and crew disembarked normally. The aircraft has been grounded for detailed inspection. The incident… pic.twitter.com/6q0elZhVI6
— ANI (@ANI) May 21, 2026
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!