MIM leader shot dead: బీహార్ రాష్ట్రంలో రాజకీయ హత్య చోటు చేసుకుంది. ఆల్ ఇండియా మజ్లిక్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పార్టీ నాయకుడు ఆరిఫ్ జమాల్ని శనివారం సివాన్ జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. సివాన్ జిల్లా ఎంఐఎం అధ్యక్షుడిగా జమాల్ పనిచేస్తున్నాడు. ఘటన తర్వాత అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి, అసలు కారణాలపై ఆరా తీస్తున్నారు.
Read Also: Madhya Pradesh: “మీ చెల్లికి నిప్పంటించాం”.. సోదరుడికి అత్తమామల ఇంటి నుంచి ఫోన్..
ఈ ఘటనపై ఆర్జేడీ అధికార ప్రతినిధి ఎజాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. ఈ ఘటన బాధాకరమని, కాల్పులు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్జేడీ-జేడీయూ ప్రభుత్వం నేరాలను సహించదని, దోషులను కటకటాల వెనకకి పంపుతామని అన్నారు. మరోవైపు బీజేపీ ఈ ఘటనపై ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది.
బీహార్లో మహాఘట్బంధన్ (ఆర్జేడీ-జేడీయూ మరియు కాంగ్రెస్) ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ‘జంగిల్ రాజ్’ తిరిగి వచ్చిందని బీజేపీ అధికార ప్రతినిధి అరవింద్ సింగ్ ఆరోపించారు. లాలూ యాదవ్ కొడుకు తేజస్వీ యాదవ్ ఉపముఖ్యమంత్రిగా, నితీష్ కుమార్ సీఎంగా ఉండగా బీహార్ లో మళ్లీ జంగిల్ రాజ్ తిరిగి రావడం చూస్తు్న్నామని, ఎక్కడ చూసినా నేరగాళ్లు ఉన్నారని, ఒక్కసారి బీజేపీ అధికారంలోకి వస్కతే వారంతా ఉండరని అన్నారు.