Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Agrasen Gehlot Was Searched By The Cbi Today

CBI: రాజస్థాన్‌ సీఎం సోదరుడి ఇంట్లో సీబీఐ సోదాలు..

Published Date :June 17, 2022 , 12:21 pm
By Mahesh Jakki
CBI: రాజస్థాన్‌ సీఎం సోదరుడి ఇంట్లో సీబీఐ సోదాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లోత్ సోదరుడు అగ్రసేన్ గెహ్లోత్ ఇంట్లో శుక్రవారం ఉదయం సీబీఐ సోదాలు నిర్వహించింది. జోధ్‌పూర్‌లోని ఆయన ఇంటితో పాటు, ఆయన కార్యాలయాల్లో కూడా ఈ తనిఖీలు చేపట్టినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించారు. తాజాగా వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ తనిఖీలు జరిపినట్లు చెప్పాయి.

కాగా అగ్రసేన్ గెహ్లాట్‌పై ఎరువుల ఎగుమతుల్లో అవకతవకల ఆరోపణలున్నాయి. గతంలో ఎరువుల కుంభకోణానికి సంబంధించి ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ విచారణను ఎదుర్కొన్నారు. 2007, 2009 సంవత్సరాల్లో పెద్ద మొత్తంలో ఎరువులను చట్టవిరుద్ధంగా విదేశాలకు ఎగుమతి చేశారని ఈడీ పేర్కొంది. అగ్రసేన్ గెహ్లోత్‌కు చెందిన ‘అనుపమ్ కృషి’ కంపెనీ ‘సరఫ్ ఇంపెక్స్’ అనే కంపెనీ ద్వారా మన దేశ రైతులకు సబ్సిడీ కింద అందించాల్సిన మ్యూరియేట్ ఆఫ్ పొటాష్‌ను అక్రమంగా విదేశాలకు తరలించినట్లు పేర్కొంది. ఈ ఎరువుల కేసులో ఎక్స్‌పోర్టింగ్ కంపెనీ ‘సరఫ్ ఇంపెక్స్‌’తోపాటు ఇతర కంపెనీలపై మనీల్యాండరింగ్ నిరోధక చట్టాల కింద ఈడీ దర్యాప్తు చేస్తోన్న విషయం తెలిసిందే.

Sonia Gandhi: పోస్ట్ కరోనా సమస్యలతో బాధపడుతున్న సోనియా..

ఇదిలా ఉంటే.. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈడీ విచారణను ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దిల్లీతో సహా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి సోదరుడి నివాసంలో సోదాలు జరగడం గమనార్హం. కాగా, ఇవన్నీ ప్రతికార రాజకీయాలు అంటూ కాంగ్రెస్‌ నేతలు ఖండిస్తున్నారు. వచ్చే ఏడాది రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • agrasen gehlot
  • Ashok Gehlot
  • CBI
  • CBI raids
  • rajastan cm brother

తాజావార్తలు

  • Tirumala Devotees Record: రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు.. ఏడాదిలో 2.67 కోట్ల మందికి దర్శనం..

  • Best CNG SUVs India: దేశంలో అత్యంత చౌకైన 5 CNG SUVలు ఇవే.. ధరలు రూ. 6.75 లక్షల నుండి ప్రారంభం

  • PSL 2026 Controversy: “ఆ బోలింగ్ బాలేదు.. నేను ఆడను పో”.. పాకిస్థాన్ సుపర్‌ లీగ్‌లో గమ్మత్తు ఉదంతం..

  • Israel-lebanon: అమెరికా మధ్యవర్తిత్వంలో లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు.. ఎప్పుడంటే..!

  • Drumstick Pickle Recipe: మునగ ప్రయోజనాలు తెలుసు కదా.. ఇలా సులువుగా మునగ పచ్చడి తయారు చేయండి..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions