Lithium: ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత ఖరీదైన, విలువైన ఖనిజంగా ఉన్న లిథియం నిల్వలు భారతదేశంలో బయటపడుతున్నాయి. కొన్ని నెలల క్రితం జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాలో భారీ లిథియం నిల్వలను కనుగొన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) వెల్లడించింది. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ తర్వాత రాజస్థాన్ లో కూడా లిథియం నిల్వలను కనుగొన్నారు. నాగౌర్ జిల్లాలోని దేగానాలో ఈ లిథియం నిల్వలు కనుగొన్నట్లు తెలిపింది.
Read Also: Chandrika Saha: 15 నెలల పిల్లాడ్ని నేలకేసి కొట్టిన తండ్రి.. భార్య ఆ పని చేయలేదన్న కోపంతోనే..
అయితే జమ్మూ కాశ్మీర్లో లభించిన నిల్వల కన్నా ఇవే ఎక్కువ అని, దేశవ్యాప్తంగా 80 శాతం డిమాండ్ ను ఇవి తీర్చగలవని చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో, సెల్ ఫోన్లలో వాడే బ్యాటరీలు, ఎలక్ట్రానికి వాహానాల బ్యాటరీల్లో లిథియంను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం లిథియం బ్యాటరీల ఉత్పత్తిలో చైనా గుత్తాధిపత్యం నడుస్తోంది. భారత్ లిథియంతో పాటు నికెల్, కోబాల్ట్ ఖనిజాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. లిథియం అయాన్ బ్యాటరీలో అధిక శక్తి సాంద్రత కలిగి ఉంటాయి. బరువు, పరిమాణం తక్కువగా ఉండటంతో వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
ప్రస్తుతం లిథియం నిల్వలు కనుగొనబడిన డెగానాలోని రేవంత్ కొండపై 1914లో బ్రిటిష్ వారు టంగ్‌స్టన్ కనుగొన్నారు. టంగ్‌స్టన్ మంచి విద్యుత్ వాహకం. మొదటి ప్రపంచ యుద్దంలో బ్రిటీస్ సైన్యం కోెసం యుద్ధ సామాగ్రిని తయారు చేయడానికి ఉపయోగించారు. 2017-18లో జీఎస్ఐ చేసిన సర్వేలో ఈ ప్రాంతంలో 1.36 మిలియన్ టన్నుల లిథియం ఉన్నట్లు కేంద్రమంత్రి ప్లహ్లాద్ జోషి వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ లో 5.9 మిలియన్ టన్నులను జీఎస్ఐ గుర్తించింది. లిథియం మరిన్ని నిల్వలను కనుగొనేందుకు జీఎస్ఐ జీ2 సర్వేని ప్రారంభించింది. డేగానాలో లిథియం నిల్వలు చైనా గుత్తాధిపత్యానికి గండి కొట్టనుంది.