India Richest MLAs: ధనిక, పేద ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఎక్కువగా ఉన్నారంటే..!
- ధనిక ఎమ్మెల్యేల రిపోర్టు విడుదల చేసిన ఏడీఆర్
- రూ.3,400 కోట్లతో టాప్‌లో ఉన్న మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఎమ్మెల్యేల ఆర్థిక స్థితిగతులపై ఏడీఆర్ నివేదిక వెలుగులోకి వచ్చింది. దేశంలో అత్యంత ధనవంతుడైన బీజేపీ ఎమ్మెల్యేకు రూ.3,400 కోట్లు ఉన్నాయని.. అత్యంత పేద బీజేపీ ఎమ్మెల్యే ఆస్తులు కేవలం రూ.1,700లే అని పేర్కొంది. ఎన్నికల్లో పోటీ చేసే ముందు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ విశ్లేషణ చేసి నివేదిక విడుదల చేసింది.

Also Read
- Milk Price Hike: పండుగ సీజన్‌కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
- Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్‌లో కొత్త సంక్షోభం..!
- CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్‌షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
ముంబైలోని ఘట్కోపర్ తూర్పు నియోజకవర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థి పరాగ్ షా దాదాపు రూ.3,400 కోట్ల ఆస్తులతో భారతదేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యే అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన నివేదిక తెలిపింది . ఆయన తర్వాత కర్ణాటకలోని కనకపుర ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ రూ.1,413 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లోని ఇండస్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా అత్యంత పేద ఎమ్మెల్యేగా ఉన్నట్లు పేర్కొంది. ఆయన ప్రకటించిన ఆస్తులు కేవలం రూ. 1,700 మాత్రమేనని తెలిపింది. 28 రాష్ట్ర అసెంబ్లీలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 4,092 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లు పరిశీలించింది.
అత్యంత ధనిక ఎమ్మెల్యేలు వీళ్లే..
చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి: రూ. 931 కోట్లు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్: రూ. 757 కోట్లు
కేహెచ్ పుట్టస్వామి గౌడ, కర్ణాటక స్వతంత్ర ఎమ్మెల్యే: రూ.1,267 కోట్లు
ప్రియాకృష్ణ, కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే: రూ.1,156 కోట్లు
పి. నారాయణ, ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్యే: రూ. 824 కోట్లు
వి ప్రశాంతి రెడ్డి, ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్యే: రూ. 716 కోట్లు
టాప్ 10 అత్యంత సంపన్నుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. టాప్ 20 అత్యంత సంపన్న ఎమ్మెల్యేలలో ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణతో సహా ఏడుగురు శాసనసభ్యులు ఉన్నారు.
తాజావార్తలు
-
Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
-
Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్‌తో హారర్ మూవీ?
-
H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
-
Milk Price Hike: పండుగ సీజన్‌కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
-
Race 4: ‘రేస్’ రీబూట్‌లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్‌తో అల్టిమేట్ యాక్షన్ ?
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!