Race 4: ‘రేస్’ రీబూట్‌లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్‌తో అల్టిమేట్ యాక్షన్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Race 4: బాలీవుడ్ యాక్షన్ ఫ్రాంచైజీ ‘రేస్ 4’లో సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వచ్చిన మూడు భాగాలు సూపర్ హిట్ అవ్వడంతో నిర్మాత రమేష్ తౌరానీ ఈ ప్రతిష్టాత్మక ఫ్రాంచైజీ రీబూట్ కోసం రంగంలోకి దిగుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆమిర్ ఖాన్‌తో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ లైన్ బాగా నచ్చడంతో అమీర్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది (2027) ప్రారంభంలో పట్టాలెక్కే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో అమీర్ ఖాన్‌తో ‘ధూమ్ 3’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా, అమీర్ ఖాన్ ఎంట్రీతో ఈ ప్రతిష్టాత్మక యాక్షన్ థ్రిల్లర్ సిరీస్‌పై బాలీవుడ్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ఈ రీబూట్‌లో ఆమిర్‌తో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా, టైగర్ ష్రాఫ్ కూడా భాగమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఇద్దరు నటులకు కూడా కథ నచ్చినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఈ పేర్లేవీ ఆఫీషియల్ గా ఖరారు కాలేదు. ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉండటంతో నటీనటుల ఎంపిక, పాత్రలు, షూటింగ్ షెడ్యూల్ వంటి విషయాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. అందువల్ల అమీర్ , సిద్ధార్థ్, టైగర్ ముగ్గురూ ఒకే సినిమాలో కనిపిస్తారని ఇప్పుడే నిర్ధారించుకోవడం తొందరపాటే అవుతుంది. ఇక ఈసారి ‘రేస్’ను పాత కథకు కొనసాగింపుగా కాకుండా పూర్తిగా కొత్త ప్రపంచంతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్‌కు విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తుండటంతో ‘రేస్’ యాక్షన్ ఫ్రాంచైజీని కొత్తగా ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి మొదలైంది. నిర్మాత రమేష్ తౌరానీ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. కథ, స్క్రీన్‌ప్లే, యాక్షన్ డిజైన్ వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.
Also Read
అమీర్ ఖాన్ ప్రస్తుతం కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న ‘లల్కార్’తో పాటు ‘3 ఇడియట్స్ 2’ గురించి కూడా ఇప్పటికే వార్తలు వచ్చాయి. వీటితో పాటు మరికొన్ని విభిన్నమైన కథలను ఆయన పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘రేస్ రీబూట్’కు అమీర్ ఓకే చెబితే, ఆయన కెరీర్లో మరో ఆసక్తికరమైన జానర్ ప్రయోగంగా ఇది నిలిచే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి ఇదంతా చర్చల దశలో ఉన్న సమాచారం మాత్రమే. నిజంగానే అమీర్ ఖాన్, సిద్ధార్థ్ మల్హోత్రా, టైగర్ ష్రాఫ్ ఒకే సినిమాలో కలిసి, విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో కొత్త తరహా ‘రేస్’ను తీసుకొస్తే మాత్రం బాలీవుడ్లో ఇది భారీ అంచనాలు పెంచే ప్రాజెక్ట్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!