PM Modi Resignation: ప్రధాని మోడీ రాజీనామా, ఆ తర్వాతే లోక్‌సభ రద్దు.. టీఎంసీ నేత వ్యాఖ్యలు వైరల్!
- కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ పై టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ ఫైర్..
- ముందు ప్రధాని మోడీ, కేంద్ర కేబినెట్, ఆ తర్వాతే లోక్‌సభ రద్దు చేయాలి..
- బీజేపీ ఎంపీలందరూ ఓటర్ల జాబితా ఆధారంగా గెలిచారు: టీఎంపీ నేత అభిషేక్ బెనర్జీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Resignation: తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్ (EC) ఓటర్ల జాబితాలో లోపాలు ఉన్నాయంటే.. మొదట ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన కేబినెట్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక, ఎన్నికల కమిషన్ తప్పుడు ఓటర్ల జాబితా ఆధారంగా ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడింది.. కాబట్టి దానికి చట్టబద్ధత లేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని, హోంమంత్రి, రక్షణమంత్రి, ఆరోగ్యమంత్రి సహా 240కిపైగా బీజేపీ ఎంపీలు ఇదే ఓటర్ల జాబితా ఆధారంగా గెలిచినట్లు ఆరోపించారు. ఈ ఎంపీలు అందరు రాబోయే రోజుల్లో దేశానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కూడా ఎన్నబోతున్నారని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ పేర్కొన్నారు.
Read Also: SSMB 29 : రాజమౌళి-మహేశ్ సినిమాలో సనాతన ధర్మం..?
Also Read
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
ఇక, ఎన్నికల కమిషన్ కొన్ని రాష్ట్రాల్లోనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపడుతూ.. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సరైనదని చెప్పడం తప్పు అని టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ తెలిపారు. దేశంలో చట్టం ఒక్కటే, రాష్ట్రాల వారీగా వేరే నియమాలు ఉండవని అభిషేక్ బెనర్జీ స్పష్టం చేశారు. బీహార్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగిస్తే బీజేపీ ఓడిపోతుందని తెలిసి, అక్కడే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ప్రారంభించారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ఓటర్ల హక్కును దోచుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అలాగే, ఢిల్లీలో ప్రతిపక్ష ఎంపీలు, మహిళా పార్లమెంటేరియన్లు నిర్వహించిన నిరసన సందర్భంగా ఢిల్లీ పోలీసులు వారిని తోసివేయడం, వేధింపులకు గురి చేసినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ భయపడుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుంది.. మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారని అభిషేక్ బెనర్జీ విమర్శించారు.
Read Also: India-China Flights: ఐదేళ్ల తర్వాత చైనాకు విమాన సర్వీసులు.. ఎయిర్ ఇండియా, ఇండిగోలకు కేంద్రం ఆదేశాలు
అయితే, ఒకే పాన్ నంబర్ గుజరాత్, బెంగాల్‌లో ఎలా ఉండగలదు? అని తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అడిగారు. ఒకే వ్యక్తి పేరు 10 పోలింగ్ స్టేషన్లలో ఎలా ఉంటుంది?.. ఒక ఇంట్లో 100 మంది ఓటర్లు ఎలా ఉంటారు? లాంటి ప్రశ్నలు సంధించారు. ఎన్నికల కమిషన్ నిజంగా ఓటర్ల జాబితాలో లోపాలను సరి చేయాలనుకుంటే.. ముందుగా ప్రధాని మోడీ, కేబినెట్ రాజీనామా చేసిన తర్వాత లోక్‌సభను రద్దు చేసి.. దేశవ్యాప్తంగా SIR జరపాలని అభిషేక్ బెనర్జీ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!