AAP vs BJP: ‘‘రావణుడు బంగారు జింకగా వచ్చాడా..?’’ కేజ్రీవాల్‌పై బీజేపీ విమర్శలు..
- అరవింద్ కేజ్రీవాల్ ‘‘రావణుడి’’ వ్యాఖ్యలు..
- ఎన్నికల హిందువు అంటూ బీజేపీ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP vs BJP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ వర్సెస్ బీజేపీ నడుస్తోంది. ఇరు పార్టీలు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ రావణుడు బంగారు జింక రూపంలో వచ్చి సీతని అపహరించాడు’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది.
ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ.. రావణుడు సీతను అపహరించిన దానిపై మాట్లాడారు. ‘‘సీతను చూసుకోవాలని సోదరుడు లక్ష్మణుడికి రామచంద్రుడు సూచించాడు. ఆయన అడవిలో ఆహారం ఏర్పాటు చేయడానికి వెళ్లాడు. రావణుడు బంగారు జింక రూపంలో వచ్చాడు. సీతమ్మ లక్ష్మణుడితో ఆ జింక కావాలని కోరింది. లక్ష్మణుడు ముందు వెళ్లేందుకు నిరాకరించాడు. ఆ తర్వాత జింకను వెతుక్కుంటూ వెళ్లాడు. ఆ తర్వాత రావణుడు తన జింక రూపాన్ని మార్చుకుని సీతను అపహరించాడు. బీజేపీ వాళ్లు బంగారు జింక లాంటి వారు, వారి ఉచ్చులో పడకండి’’ అని అన్నారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్‌పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
Read Also: Etela Rajender: 25 ఏళ్ల జీవితంలో ఎవరిపై చేయి చేసుకోలేదు.. న్యాయం కోసం తప్పలేదు
నిజానికి రామాయణం ప్రకారం..‘‘బంగారు జింక’’ రూపాన్ని ధరించిన వాడు ‘‘మారీచుడు’’ అనే రాక్షసుడు. జింకను వేటాడేందుకు లక్ష్మణుడు వెళ్లిన సమయంలో, సన్యాసి రూపంలో వచ్చిన రావణుడు సీతమ్మ వారిని అపహరించాడు. కేజ్రీవాల్ చేసిన తప్పుడు వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ.. కేజ్రీవాల్ హిందూ మతాన్ని అవమానించారని అన్నారు. ‘‘రావణుడు బంగారు జింక రూపాన్ని ఎప్పుడు ధరించాడు..?’’ అని ప్రశ్నించాడు. శీష్ మహల్లో నివసిస్తున్న కేజ్రీవాల్‌కి బంగారంపై మక్కువ పోలేదని విమర్శించారు.
ఎన్నికల సమయంలోనే కేజ్రీవాల్ ‘‘ఎన్నికల హిందువు’’గా మారుతాడని అన్నారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలకు రాముడే న్యాయం చేస్తాడని ఎన్నికలను ఉద్దేశించి అన్నారు. అయితే, బీజేపీ విమర్శలకు ప్రతిగా మనీష్ సిసోడియా మాట్లాడుతూ, బీజేపీ రావణుడిలా తన వారసులను సమర్థిస్తోందని అన్నారు. ఢిల్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య విమర్శలు పెరిగాయి. మొత్తం 70 స్థానాలు ఉన్న అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు, ఫిబ్రవరి 08న ఫలితాలు వెలువడనున్నాయి.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!