Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ లో ఈడీ చార్జీషీట్ లో కీలక వ్యక్తుల పేర్లను చేర్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును కూడా చేర్చింది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మరో 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనపరుస్తోంది. అయితే పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం రావడం ఖరారు కాగా గోవాలో హంగ్ ఏర్పడుతుందని ప్రస్తుత ఫలితాల సరళి చాటి చెప్తోంది. 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో బీజేపీ 19 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 21 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది. బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో గోవా ప్రభుత్వ ఏర్పాటులో టీఎంసీ, ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు.…
results for the five state elections will be released today. దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. 5 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. అంతేకాకుండా ఆప్, ఎస్పీ తదితర పార్టీల నేతలు కూడా తమ అభ్యర్థులు గెలవడం ఖాయం అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 8 గంటలకు 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.…
Live : 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్ దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవాళ తేలనున్నాయి. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ లలో ఏయే పార్టీలు అధికారంలోకి రానున్నాయి..? ఎవరు పైచేయి సాధిస్తారు..? అక్కడున్న అధికార పక్షానికి ధీటుగా నిలిచేదెవరు.. గెలిచేదెవరు..? అనేది దేశవ్యాప్తంగా తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఈ ఎన్నికల కౌంటి నేడు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. కౌంటింగ్‌కు…
ఉత్తరప్రదేశ్‌లోని 16 జిల్లాల్లో 59 నియోజకవర్గాలకు ఈరోజు మూడో విడత పోలింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో కూడా నేడు ఓటింగ్ జరగనుంది. పంజాబ్‌లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. యూపీలో ఈ రోజు ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. 16 జిల్లాల్లోని 59 అసెంబ్లీ స్థానాలకు జరిగే మూడో దశలో 627 మంది…
మరో నాలుగు నెలల్లో గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ప్రధాన పార్టీలు చూస్తున్న సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్న బీజేపీ ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకొని మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నది. అయితే, దేశంలో పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ప్రభావం ఈ ఎన్నికలపై కనిపించే అవకాశం ఉన్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటుగా ఈసారి గోవా నుంచి తృణమూల్, ఆప్ పార్టీలు కూడా బరిలోకి…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం గోవాలో సందడి చేశారు. తనదైన రీతిలో అందరితో కలిసిపోయారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. గోవా వీధుల్లో కొంతసేపు బైక్‌పై తిరిగారు. ప్రోటోకాల్ వద్దంటున్నా రోడ్డు పక్కన ఉన్న దాబాలో భోజనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఉదయం దక్షిణ గోవా చేరుకున్న రాహుల్.. అక్కడి బాంబూలిమ్ గ్రామంలో మత్స్యకారులను కలిసి వారితో మాట్లాడారు. వారి సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. మార్గమధ్యంలో రోడ్డు…