NTV Telugu Site icon

Haryana: ఆప్ సంచలన నిర్ణయం.. ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయం!

Kejriwal

Kejriwal

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరనట్లుగా తెలుస్తోంది. ఇరు పార్టీల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినా సఫలీకృతం కాలేదు. దీంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల సమయంలో రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే బరిలోకి దిగాయి. అయితే ఆప్ ఆశించిన స్థాయిలో ఓట్లు రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీకి ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ససేమిరా అంటోంది. సింగిల్ డిజిట్‌కే పరిమితం చేస్తోంది. 5-6 స్థానాలు కంటే ఎక్కువ ఇవ్వలేమని హస్తం పార్టీ తెగేసి చెప్పింది. ఆప్ మాత్రం 10 స్థానాలు కోరుతోంది. దీంతో సీట్లు పంచాయితీ కొలిక్కి రాకపోవడంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని ఆప్ భావిస్తోంది.

ఇది కూడా చదవండి: Duckout: టీ20 చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా..?

హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీ ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసింది. 67 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితా ప్రకటన తర్వాత కమలం పార్టీలో కూడా అలకలు మొదలయ్యాయి. కొంత మంది సీనియర్లకు టికెట్లు లభించకపోవడంతో అలకబూనారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి సైనీ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Bangladesh: పాకిస్తాన్‌ నుంచి భారీగా ఆయుధాలు కొంటున్న బంగ్లాదేశ్.. ఇండియానే లక్ష్యమా..?