Rekha Gupta-AAP: ప్రభుత్వ సమీక్షలకు సీఎం రేఖా గుప్తా భర్త హాజరు.. ఆప్ తీవ్ర విమర్శలు
- ప్రభుత్వ సమీక్షలకు సీఎం రేఖా గుప్తా భర్త హాజరు
- రాజ్యాంగ విరుద్ధమంటూ ఆప్ తీవ్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీరును ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో భర్త మనీష్ గుప్తాను పక్కనే కూర్చోబెట్టుకోవడంపై విమర్శలు గుప్పించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ధ్వజమెత్తారు. ఎక్స్‌లో ఇందుకు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేసి విమర్శించారు. షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి ప్రాజెక్టులపై అధికారులతో జరిగిన సమీక్షా సమావేశానికి సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు.
ఇది కూడా చదవండి: US: అమెరికాలో దారుణం.. రైల్లో ఉక్రెయిన్ శరణార్థి హత్య
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఆదివారం రేఖా గుప్తా షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే ఆశ్చర్యంగా ఈ సమావేశానికి రేఖా గుప్తా భర్త మనీష్ గుప్తా కూడా హాజరయ్యారు. పైగా రేఖా గుప్తా పక్కనే కూర్చున్నారు. ఫొటోలు బయటకు రావడంతో ఆప్ తప్పుపట్టింది. ప్రభుత్వ సమీక్షల్లో భర్తను ఎలా కూర్చోబెట్టుకుంటారని ముఖ్యమంత్రిని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నించింది. ప్రముఖ వెబ్ సిరీస్ పంచాయత్‌లో రఘుబీర్ యాదవ్ పోషించిన ‘ప్రధానపతి’ పాత్రకు సమాంతరంగా వ్యవహరించారని.. అనధికారికంగా సర్పంచ్ భార్య కోసం ఉద్దేశించిన పాత్రను నీనా గుప్తా పోషించారని ఎత్తి చూపారు. ఫొటోలు ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి తీసుకున్నామని.. అలాగే సీఎంవో అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి కూడా తీసుకున్నట్లు ఆప్ నేత భరద్వాజ్ అన్నారు.
ఇది కూడా చదవండి: Trump: మరోసారి అమెరికా వెళ్లనున్న యూరోపియన్ నేతలు.. ట్రంప్‌తో కీలక భేటీ!
ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అంటూ భరద్వాజ్ ధ్వజమెత్తారు. ప్రపంచంలోని అతి పెద్ద పార్టీ సీఎంకు నమ్మదగిన కార్యకర్తే లేరా? ఆమె భర్తను ఎలా పక్కను కూర్చోబెట్టుకుంటారని నిలదీశారు. ఏ చట్ట ప్రకారం భర్తను ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలో భాగం చేస్తున్నారని అడిగారు. కాంగ్రెస్‌ను వంశపారంపర్య రాజకీయాలంటూ నిరంతరం విమర్శించే బీజేపీ.. ఇది వంశపారంపర్య రాజకీయాలు కాదా? అని నిలదీశారు. దేశ రాజధానిలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థ బహిరంగంగా అపహాస్యం చేయబడుతుందని భరద్వాజ్ పేర్కొన్నారు. ఫొటోల్లో రేఖా గుప్తా పక్కనే భర్త మనీష్ గుప్తా కూర్చుని అధికారులతో సంభాషించారు.
మనీష్ గుప్తా బ్యాగ్రౌండ్ ఇదే..
రేఖా గుప్తా భర్త మనీష్ గుప్తా వ్యాపారవేత్త. షాలిమార్ బాగ్‌లో వ్యాపారాలు ఉన్నాయి. రేఖా గుప్తా ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. మనీష్ గుప్తా నికుంజ్ ఎంటర్ప్రైజ్ సంస్థను స్థాపించి వ్యాపారం నిర్వహిస్తున్నారు. అలాగే బీమా వ్యాపారం కూడా నిర్వహిస్తున్నారు. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. మనీష్ గుప్తా కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో సంబంధం కలిగి ఉన్నారు.
दिल्ली सरकार बनी फुलेरा पंचायत
जैसे फुलेरा की पंचायत में महिला प्रधान के पति प्रधान की तरह काम करते थे , आज दिल्ली में CM के पति आधिकारिक मीटिंग में बैठ रहे हैं ।
हमने पहले भी बताया था कि CM आले पति आधिकारिक मीटिंग में बैठते हैं , अधिकारियों के साथ मीटिंग और इंस्पेक्शन करते… pic.twitter.com/40D3kz5OXU
— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) September 7, 2025
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!