గుజరాత్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు ఇతర పార్టీల నేతలను ఆకర్షించే పనిలో పడ్డాయి. ముఖ్యంగా ఇటీవల పంజాబ్‌లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్‌లో కూడా విజయబావుటా ఎగురవేయాలని పట్టుదలతో కనిపిస్తోంది. ఈ మేరకు గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్డిక్ పటేల్‌ను తమ పార్టీలోకి ఆహ్వానించింది.
కాంగ్రెస్ లాంటి పార్టీలో హార్డిక్ పటేల్ వంటి నేతలు ఉండకూడదని గుజరాత్ ఆమ్ ఆద్మీ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో హార్డిక్ అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తున్నారని.. ఆయన కాంగ్రెస్‌ను ఇష్టపడకపోతే తమ పార్టీలో చేరాలని సూచించారు. కాంగ్రెస్ తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడం, సమయం వృథా చేయడం కంటే తమ పార్టీకి సేవలందించడం ఉత్తమం అని తెలిపారు. కాంగ్రెస్ లాంటి పార్టీలో హార్డిక్ లాంటి అంకితభావం ఉన్న వ్యక్తులకు స్థానం ఉండదని గోపాల్ ఇటాలియా ఆరోపించారు.
Prashant Kishor: కాంగ్రెస్ పార్టీలో చేరనున్న పీకే..? సోనియా, రాహుల్‌తో భేటీ..