Ravindra Jadeja: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. దేశం కంటే భార్య పోటీ చేస్తున్న ఎన్నికలు ముఖ్యమా అని నిలదీస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జడేజా గాయం కారణంగా ఆసియా కప్ నుంచి నిష్క్రమించాడు. ఆ తర్వాత సర్జరీ చేయించుకోవడంతో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీకి కూడా దూరంగా ఉన్నాడు. అయితే వచ్చేనెలలో జరిగే బంగ్లాదేశ్ పర్యటనకు బీసీసీఐ జడేజాను ఎంపిక చేసింది. కానీ తనకు ఇంకా…
గుజరాత్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు ఇతర పార్టీల నేతలను ఆకర్షించే పనిలో పడ్డాయి. ముఖ్యంగా ఇటీవల పంజాబ్‌లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్‌లో కూడా విజయబావుటా ఎగురవేయాలని పట్టుదలతో కనిపిస్తోంది. ఈ మేరకు గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్డిక్ పటేల్‌ను తమ పార్టీలోకి ఆహ్వానించింది. కాంగ్రెస్ లాంటి పార్టీలో హార్డిక్ పటేల్ వంటి నేతలు ఉండకూడదని గుజరాత్ ఆమ్ ఆద్మీ అధ్యక్షుడు…
కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆప్ పార్టీ దేశంలోని మరో రాష్ట్రంపై కన్నేసింది. ఆప్ ఖాతాలో ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో రాష్ట్రాన్ని కూడా చేజిక్కించుకోవాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఈ దిశగా ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఇప్పటికే కార్యాచరణ రూపొందిస్తున్నారు. గుజరాత్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఇంద్రానిల్ రాజ్‌గురు హస్తం పార్టీకి…