Ahmedabad plane crash: పైలట్ మేనల్లుడికి నోటీసులు.. మండిపడుతున్న పైలట్ సంఘాలు
- అహ్మదాబాద్ ఎయిరిండియా పైలట్ మేనల్లుడికి నోటీసులు
- నోటీసులపై మండిపడుతున్న పైలట్ సంఘాలు
- జూన్ 12, 2025లో విమాన ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం వెనుక ఏం జరిగిందో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. గతేడాది జూన్ 12న ప్రమాదం జరిగితే.. ఇప్పటి వరకు దర్యాప్తు సంస్థలు ఏం తేల్చలేకపోయాయి. అప్పటి నుంచి దర్యాప్తు చేస్తూనే ఉన్నాయి. తాజాగా పైలట్ సుమిత్ సభర్వాల్ మేనల్లుడు వరుణ్ ఆనంద్‌కు విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో (AAIB) సమన్లు జారీ చేసింది. జనవరి 15న దర్యాప్తునకు రావాలని సమన్లు అందజేసింది. ఈ సమన్లపై పైలట్ సంఘాలు మండిపడుతున్నాయి. వేధించేందుకే ఈ సమన్లు జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఏఏబీఐకి లీగల్ నోటీసులు పంపించింది.
ఇది కూడా చదవండి: Supreme Court: పోలీసులతో కలిసి మమత సాక్ష్యాలను దొంగిలించారు.. ఈడీ ఆరోపణలు
Also Read
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
వరుణ్ ఆనంద్ కూడా ఎయిరిండియాలో పైలట్‌గా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా భారత పైలట్ల సమాఖ్యలో సభ్యుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో వరుణ్ ఆనంద్‌కు నోటీసులు ఇవ్వడమేంటి? అని ప్రశ్నిస్తోంది. ఏఏఐబీ నోటీసులను పూర్తి అనవసరమైన చర్యగా పేర్కొంది. అహ్మదాబాద్ ప్రమాదంతో ఎలాంటి సంబంధం లేని వరుణ్ ఆనంద్‌ను పిలవడమేంటి? అని నిలదీసింది. ‘‘ఇది వేధింపులకు పాల్పడటం, మానసిక క్షోభకు గురిచేయడమే అవుతుంది. ఆయన వృత్తిపరమైన, వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది’’ అని పైలట్ల సమాఖ్య పేర్కొంది.
జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం లండన్‌కు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం సమీపంలోని హాస్టల్‌పై కూలిపోయింది. ఒక్కరు మినహా 241 మంది చనిపోయారు. హాస్టల్లో మెడికోలు కూడా చనిపోయారు. ఇలా మొత్తం 271 మంది ప్రాణాలు కోల్పోయారు.
అయితే ప్రమాదం జరిగిన కొన్ని రోజులకు ప్రాథమిక రిపోర్టు వచ్చింది. ఈ రిపోర్ట్‌పై అంతర్జాతీయ మీడియా అనేక కథనాలు ప్రసారం చేశాయి. పైలట్ ఆత్మహత్య చేసుకోవడం వల్లే ఈ ఘటన జరిగినట్లుగా పేర్కొన్నాయి. ఈ కథనాలపై కూడా పైలట్ సంఘాలు మండిపడ్డాయి.
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!