Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News A Girl Post On Marriage Going Viral On Social Media

Girl On Marriage: అతడ్ని పెళ్లి చేసుకోవచ్చా.. యువతి ప్రశ్న, నెట్టింట దుమారం

Published Date :February 7, 2023 , 2:00 pm
By NTV WebDesk
Girl On Marriage: అతడ్ని పెళ్లి చేసుకోవచ్చా.. యువతి ప్రశ్న, నెట్టింట దుమారం
  • Follow Us :
  • google news
  • dailyhunt

A Girl Post On Marriage Going Viral On Social Media: కొన్ని బంధాలు ప్రేమతో కలిస్తే, మరికొన్ని బంధాల మధ్య వ్యాపార లావాదేవీలు (కట్న కానుకలు) కొనసాగుతాయి. అందుకే.. పెళ్లి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, కొందరు ఆచితూచి అడుగులు వేస్తుంటారు. అవతల అబ్బాయి వాళ్లు కట్న కానుకలు బాగానే డిమాండ్ చేస్తే.. ఇటు అమ్మాయి తరఫు వాళ్లు అబ్బాయిల విషయంలోనూ కొన్ని లెక్కలు వేసుకుంటారు. ఉద్యోగం చేస్తున్నాడా? ఆస్తిపాస్తులేమైనా ఉన్నాయా? అని ఆరా తీస్తారు. ఒకవేళ పెళ్లికి ముందే అబ్బాయికి ఉద్యోగం పోతే మాత్రం, పరిణామాలు మారిపోతాయి. లేనిపోని అనుమానాలు పుట్టుకొచ్చేస్తాయి. పెళ్లి చేయొచ్చా? లేదా? అనే సందేహాలు కలుగుతాయి.

Satyavathi Rathod: తెలంగాణపై కేంద్రం విషం కక్కుతోంది.. రేవంత్ నీ పార్టీని కాపాడుకో

సరిగ్గా అలాంటి సందేహమే ఓ యువతికి వచ్చింది. తాను పెళ్లి చేసుకోబోయే ఓ యువకుడికి ఉన్నపళంగా ఉద్యోగం పోవడంతో.. అతనితో ఏడడుగులు నడవాలా? వద్దా? అనే మీమాంసలో పడింది. ఇందుకు పరిష్కారం కోసం ఆన్‌లైన్‌లో నెటిజన్ల సలహా కోరింది. ‘‘మాది కుటుంబ సభ్యులు కుదిర్చిన వివాహం. ఫిబ్రవరిలోనే ముహూర్తం నిర్ణయించారు. ఇంతలోనే నన్ను పెళ్లిచేసుకోయే అబ్బాయిని ‘మైక్రోసాఫ్ట్ ఇండియా’ సంస్థ ఉద్యోగంలో నుంచి తొలగించింది. ఈ విషయం నా కుటుంబానికి కూడా తెలుసు. అయితే.. ఇప్పుడు అతడ్ని పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనేది నాకు తెలియడం లేదు. ఉద్యోగం చేస్తున్నప్పుడు అతని వేతనం రూ.2.5 లక్షలు ఉండేది. కానీ, ఇప్పుడు అతనికి ఉద్యోగం లేదు. నన్ను ఏం చేయమంటారు? అతడ్ని పెళ్లాడొచ్చా?’’ అని ఒక సోషల్ యాప్ వేదికగా పోస్ట్ పెట్టింది. ఇప్పుడిది వైరల్‌గా మారింది.

Nahida Quadri: యూట్యూబర్‌కి భర్త వేధింపులు.. మరొకరితో చనువుగా ఉంటూ..

ఆ అమ్మాయి పెట్టిన పోస్టుకు ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘ఉద్యోగం లేని వాడు ఎలా పోషిస్తాడు? అతనికంటే మంచి స్థాయిలో ఉన్న అబ్బాయి దొరుకుతాడు? అతడ్ని వదిలెయ్’’ అంటూ కొందరు ఆ అమ్మాయికి మద్దతు తెలుపుతున్నారు. ‘అయినా.. పెళ్లి బంధాలు ఇప్పుడు వ్యాపార లావాదేవీల్లా మారాయి కాబట్టి, ఆ కోణంలో ఆలోచిస్తేనే బెటర్’ అని సూచిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆ యువకుడికి సపోర్ట్ ఇస్తున్నారు. ఈ ఉద్యోగం పోతే మరో ఉద్యోగం దొరుకుతుందని, ఉద్యోగం పోయినంత మాత్రాన అబ్బాయి మరీ పనికిరాకుండా పోడని, అంత చులకన భావన ఉండకూడదంటూ అమ్మాయికి కౌంటర్లు ఇస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుందని హితవు పలుకుతున్నారు. మరి, దీనిపై మీ అభిప్రాయం ఏంటి?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Fiance Lost Microsoft Job
  • Girl On Marriage
  • IT layoffs
  • Microsoft India
  • national news

తాజావార్తలు

  • Crude Oil: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ వేళ.. భారీగా పడిపోయిన ముడి చమురు ధరలు

  • Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్‌కి సవాల్ గా మారిన ‘LIK’ !

  • Trump: చివరి నిమిషంలో ట్రంప్ షాకింగ్ నిర్ణయం.. 2 వారాల కాల్పుల విరమణకు గ్రీన్ సిగ్నల్, కానీ..

  • Exclusive : పెద్ది పోస్ట్ పోన్.. ఓటీటీ డీల్ పై కోత పెట్టిన నెట్ ఫ్లిక్స్

  • Tollywood Summer Releases 2026 : సమ్మర్‌ అన్‌ సీజన్‌గా మారిపోయిందా.. మెగా హీరోలు కూడా హ్యాండ్‌ ఇచ్చేశారా?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions