Pink Line Metro: దేశంలో తొలి మహిళా మెట్రో.. నేడే ప్రారంభం.. ఎక్కడ నుంచి ఎక్కడికంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూణే మెట్రో నెట్వర్క్ ఒక కీలకమైన మైలురాయిని చేరుకోబోతోంది. సుమారు రూ. 8,300 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ‘పింక్ లైన్’ (లైన్ 3) ను నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. పూణే రవాణా వ్యవస్థను సమూలంగా మార్చేందుకు రూపొందించిన ఈ ప్రాజెక్ట్ అనేక ప్రత్యేకతలతో వార్తల్లో నిలిచింది. ఇందులో అత్యంత ప్రధానమైనది మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వడం. పింక్ లైన్ రైళ్లను పూర్తిస్థాయిలో మహిళా ఆపరేటర్లే నడపనుండటం విశేషం. ప్రజా రవాణా వ్యవస్థలో మహిళా భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా ఇది ఒక చారిత్రాత్మక అడుగుగా నిలవనుంది.
పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యతనిచ్చింది. ఈ మెట్రో లైన్ తనకు అవసరమైన విద్యుత్ వినియోగంలో సుమారు 30 శాతాన్ని సౌర శక్తి (సోలార్ పవర్) ద్వారా పొందేలా ప్రణాళికలు రూపొందించారు. దీనివల్ల సాంప్రదాయ విద్యుత్ పై ఆధారపడటం తగ్గడమే కాకుండా, పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించవచ్చు. ఈ పింక్ లైన్ దాదాపు 23 కిలోమీటర్ల పొడవునా విస్తరించి, మాన్ నుంచి డిస్ట్రిక్ట్ కోర్ట్ మెట్రో స్టేషన్ వరకు అనుసంధానిస్తుంది. ముఖ్యంగా పూణేలోని ప్రధాన ఐటీ హబ్ అయిన హింజవడీని, శివాజీనగర్‌తో కలపడం ద్వారా వేలాది మంది ఐటీ ఉద్యోగులకు, రోజువారీ ప్రయాణికులకు ట్రాఫిక్ తిప్పలు లేకుండా వేగవంతమైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.
Also Read
- Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
- OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
- OTR: ఆ మూడు చోట్లే కోట్ల పందాలు.. బెట్టింగ్ రాయుళ్ల లెక్కలేంటి?
- TPCC Mahesh Goud : అమిత్ షాకు మహేష్ గౌడ్ ప్రశ్నల వర్షం.. తెలంగాణకు ఏం చేశారు?
పింక్ లైన్ ప్రారంభోత్సవంతో పాటు, రూ. 13,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పూణే మెట్రో ఫేజ్-II ప్రాజెక్ట్‌కు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ రెండో దశలో లైన్లు 2A, 2B, 4, 4A లను నిర్మించనున్నారు. ఇవి నగరంలోని వివిధ నివాస, వాణిజ్య ప్రాంతాలతో పాటు ఖరాడీ, మగర్‌పట్టా, హడప్సర్, స్వర్ గేట్, వార్జే వంటి కీలక ప్రాంతాలను అనుసంధానిస్తాయి.
What makes Pune Metro’s new Pink Line so special?
23 km connecting Hinjewadi’s IT hub with Shivajinagar.
Operated by women.
Almost a third of the electricity needs planned from solar energy.
Tomorrow, this Rs. 8,300 crore infra enhancement will be inaugurated!
A significant boost to ‘Ease of Living’ for Pune!
https://t.co/sPMa94JF6k
— Narendra Modi (@narendramodi) November 2, 2026
స్వర్ గేట్, నల్ స్టాప్, ఖరాడీ బైపాస్ ల వద్ద మెట్రో మార్గాలను ఇతర బస్సు సర్వీసులతో అనుసంధానించేందుకు ఇంటర్చేంజ్ సౌకర్యాలను కల్పిస్తున్నారు. రోడ్డు రవాణాపై ఒత్తిడిని తగ్గించి, వాహన కాలుష్యాన్ని నివారించడంలో ఈ విస్తరణ ఎంతో దోహదపడుతుంది. పింక్ లైన్ ప్రారంభం, ఫేజ్-II ప్రాజెక్టులు పూణే నగర ప్రజా రవాణా రూపురేఖలను మార్చడమే కాకుండా, స్థిరమైన , ఆధునిక రవాణా వ్యవస్థకు బాటలు వేస్తాయి.
తాజావార్తలు
-
Pink Line Metro: దేశంలో తొలి మహిళా మెట్రో.. నేడే ప్రారంభం.. ఎక్కడ నుంచి ఎక్కడికంటే..
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
ట్రెండింగ్
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!