Site icon NTV Telugu

MP: ఆస్పత్రిలో అమానుషం.. వృద్ధుడిని ఈడ్చికెళ్లిన సిబ్బంది. వైద్యులు సస్పెండ్

Mp2

Mp2

మధ్యప్రదేశ్‌‌లోని ప్రభుత్వాస్పత్రిలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వృద్ధుడిని వైద్య సిబ్బంది కనికరం లేకుండా ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇద్దరు వైద్యులపై సస్పెండ్ వేటు వేసింది.

ఇది కూడా చదవండి: Rajni : జైలర్ 2 తెలుగు రాష్ట్రాల రైట్స్.. అతిగా ఆశపడుతున్న మేకర్స్

ఏప్రిల్ 17న నౌగావ్ పట్టణానికి చెందిన ఉద్ధవ్ సింగ్ జోషి (77).. భార్య వైద్య పరీక్షల కోసం ఛతర్‌పూర్‌లోని జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఏమైందో ఏమో తెలియదు గానీ ఇద్దరు వ్యక్తులు.. జోషిని లాక్కెళ్లారు. టైమ్ స్లాట్ స్లిప్ తీసుకుని చాలా సేపు క్యూలో ఉన్నానని.. తన వంతు వచ్చినప్పుడు డాక్టర్ రాజేష్ మిశ్రా అభ్యంతరం చెప్పి చెంపదెబ్బ కొట్టాడని జోషి ఆరోపించాడు. అప్పటికే ఆ స్థలం రద్దీగా ఉందని.. క్యూలో నిలబడే విషయంలో డాక్టర్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశాడని సివిల్ సర్జన్ జీఎల్ అహిర్వర్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Gaza-Israel: 15 మంది వైద్యుల హత్య.. ఉద్దేశపూర్వకంగా జరగలేదన్న ఐడీఎఫ్

ఘటనపై క్లారిటీ రాలేదు గానీ.. వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మిశ్రా, అహిర్వార్‌కు నోటీసులు జారీ చేశారు. అనంతరం కఠిన చర్యలు తీసుకున్నారు. వైద్య సేవల నుంచి మిశ్రాను తొలగించారు. ఇక ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించినందుకు సబార్డినేట్లను నియంత్రించడంలో విఫలమైనందుకు అహిర్వార్‌ను కూడా రాష్ట్ర ఆరోగ్య శాఖ సస్పెండ్ చేసింది. అంతేకాకుండా నివేదిక సమర్పించాలంటూ జిల్లా కలెక్టర్ పార్థ్ జైస్వాల్ ఆదేశాలను కూడా అహిర్వర్ విస్మరించారు. షోకాజ్ నోటీసు జారీ చేసినా స్పందించకపోవడం వేటు పడింది. అంతేకాకుండా ఈ సంఘటనకు సంబంధించి రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ ఉద్యోగి రాజేంద్ర ఖరేను కూడా తొలగించాలని కలెక్టర్ జైస్వాల్ సిఫార్సు చేసినట్లు అధికారి తెలిపారు.

ఇది కూడా చదవండి: Suriya : సూర్య కోసం దుబాయ్ లో మకాం వేసిన వెంకీ అట్లూరి

ఇదిలా ఉంటే వృద్ధుడిని ఈడ్చికెళ్లిన ఘటనలో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 115(2), 296, 3(5), మరియు 351(3) కింద నౌగావ్ పోలీస్ స్టేషన్‌లో మిశ్రాపై ‘జీరో ఎఫ్‌ఐఆర్’ నమోదు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ను ఛతర్‌పూర్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు ఆయన తెలిపారు.

Exit mobile version