Tungabhadra Dam: కర్ణాటక హోస్పెటలోని తుంగభద్ర జలాశయం ఇప్పుడు డేంజర్‌లో పడింది.. జలాయంలోని మరో 7 గేట్లు ప్రమాదంలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. 33 గేట్లలో గతేడాది ఆగస్టు 10వ తేదీన వరద ఉధృతికి 19వ గేటు కొట్టుకుపోయింది. అయితే కన్నయ్యనాయుడు సలహాతో స్టాప్ లాగ్ ఏర్పాటు చేసి తాత్కాలిక మరమ్మతులు చేశారు. కొత్తగేటు తయారైనా ఈ ఏడాది ముందస్తు వరదలతో ఆ 19వ గేటును అమర్చలేకపోయారు. మరోవైపు, మొత్తం గేట్ల కాలపరిమితి దాటిపోయిందని, అన్నిటినీ మార్చాల్సిందేనని సూచించారు కన్నయ్యనాయుడు. మిగిలిన 32 గేట్ల తయారీ పనులు కొనసాగుతున్నాయి. అయితే, ఇప్పుడు 11, 18, 20, 24, 27, 28 నంబర్ గేట్లు కూడా ప్రమాదంలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఆ 7 గేట్లు ఎంత వరద వచ్చినా ఎత్తకూడదని ఇంజినీర్ల నిర్ణయించారని సమాచారం.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
ఇక, 4వ గేటు కూడా పూర్తిగా ఎత్తడం సాధ్యం కాదని, ఒక అడుగు మాత్రమే ఎత్తవచ్చని, ఆ తరువాత మొరాయించే ఉందని గుర్తించారు. ప్రస్తుతం జలాశయానికి 23 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. భారీ వరద వస్తే అన్ని గేట్లు పైకి ఎత్తి దిగువకు నీరు విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడింది.. దీంతో జలాశయానికి ప్రమాదం తలెత్తే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది..