టెన్షన్ పెడుతోన్న ఒమిక్రాన్.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓవైపు కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతోంది.. మరోవైపు.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోంది.. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ ఇప్పటికే భారత్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఇప్పటికే 27 రాష్ట్రాలకు పాకింది.. ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 3 వేలను దాటేశాయి.. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను సవరిస్తూ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్రం.. కరోనా కేసులు తీవ్రంగా ఉన్న ఎట్ రిస్క్ దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులందరూ వారం రోజుల పాటు తప్పనిసరిగా హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.. ఈ కొత్త మార్గదర్శకాలు ఈ నెల 11వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఈ మధ్యే ఇటలీ నుంచి అమృత్‌సర్‌కి వచ్చిన ఎయిరిండియా విమానంలో 125 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో అప్రమత్తమైన కేంద్రం.. కొత్త నిబంధనలు విధించింది. మరోవైపు.. ఒమిక్రాన్ కేసులు భారీస్థాయిలో వెలుగు చూస్తుండడంతో.. ఎట్‌రిస్క్ దేశాల జాబితాను కూడా పెంచింది కేంద్రం.. యూకే, మిగతా యూరప్ దేశాలు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్‌వానా, చైనా, ఘనా, న్యూజిలాండ్, జింబాబ్వే, టాంజానియా, హాంకాంగ్, ఇజ్రాయెల్, కాంగో, ఇథియోపియా, కజకిస్తాన్, కెన్యా, నైజీరియా, ట్యునీషియా, జాంబియా దేశాలను ఎట్‌రిస్క్ దేశాలుగా పేర్కొంది.
Read Also: ప్రధాని మోడీ పంజాబ్ టూర్‌లో భద్రతా వైఫల్యం.. 150 మందిపై కేసులు..
Also Read
- NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్‌పై ఫోకస్
- Supreme Court: 'గృహిణులు జాతి నిర్మాతలు'.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
- Kalyan Banerjee: "నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?" మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
- AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
ఇక, కేంద్రం సవరించిన తర్వాత మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.
- విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తమ వివరాలతో పాటు 14 రోజుల కిందట వరకు చేసిన ప్రయాణాలను పోర్టల్‌లో నమోదు చేయాలి.
- తమ ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షలో నెగెటివ్ రిపోర్ట్ సమర్పించాలి.
- స్వదేశంలో అడుగుపెట్టగానే ఎయిర్‌పోర్ట్‌లోనే కరోనా టెస్ట్ చేయించుకోవాలి. వాటి ఫలితం వచ్చిన తర్వాతే బయటకు వెళ్లాలి.
- ఎయిర్‌పోర్ట్‌లో కరోనా టెస్ట్ కోసం ముందుగానే సువిధ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకోవాలి.
- కరోనా టెస్ట్‌లో పాజిటివ్ వస్తే ఐసోలేషన్‌కు తరలించాలి.
- కోవిడ్ నెగెటివ్‌గా తేలితే వారం రోజుల పాటు క్వారంటైన్ తప్పనిసరి.
- నెగెటివ్‌గా తేలినవారు 8వ రోజు మరోసారి ఆర్‌టీ–పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి.. మళ్లీ నెగిటివ్ వస్తే మరో వారం పాటు ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలి.
- ఎట్ రిస్క్ కాని దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు కూడా ఎయిర్‌పోర్ట్‌లో టెస్ట్ చేయించుకోవాలి.. నెగెటివ్ వచ్చినా హోంక్వారంటైన్ తప్పనిసరి.
- విదేశాల నుంచి వచ్చిన ఐదేళ్లలోపు చిన్నారులకు కోవిడ్ నిర్ధారణ పరీక్షల నుంచి మినహాయింపు ఉంటుంది.
తాజావార్తలు
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్‌పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్‌లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
-
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?