Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
- సౌదీకి పాకిస్థాన్, టర్కీ సైన్యం?
- మక్కా రక్షణ ఒప్పందం అమల్లోకి.. కీలక పరిణామం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mecca Defence Pact: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హౌతీ దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియాకు సైనిక బలగాలను వేగంగా మోహరించేందుకు పాకిస్థాన్, టర్కీ అంగీకరించినట్లు ఓ మీడియా నివేదిక వెల్లడించింది. సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ దేశాల మధ్య ఏర్పడిన మక్కా డిఫెన్స్ అలయన్స్ ఇప్పుడు సైనికపరంగా అమలులోకి వెళ్లే దిశగా అడుగులు వేస్తోంది. సౌదీ అరేబియాలోని రియాద్‌లో సోమవారం Strategic Political and Defence Committee (SPDC) అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మూడు దేశాల భద్రతకు ఎదురవుతున్న ముప్పులు, ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు.
పాకిస్థాన్ విదేశాంగ శాఖను ఉటంకిస్తూ Dawn ఈ వివరాలను వెల్లడించింది. సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ దేశాలు గత ఆగస్టులో త్రైపాక్షిక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాల్లో ఏదైనా ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే, దానిని మూడు దేశాలపై జరిగిన దాడిగా పరిగణించి సమిష్టిగా స్పందించే విధానం ఏర్పాటైంది.
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
సౌదీలోకి బలగాల వేగవంతమైన మోహరింపునకు నిర్ణయం
సోమవారం సమావేశం అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో కీలక నిర్ణయాలను వెల్లడించారు. సామూహిక రక్షణకు సంబంధించిన హామీలను వెంటనే అమలు చేసే దిశగా చర్యలు ప్రారంభించాలని కమిటీ నిర్ణయించింది. అలాగే అంగీకరించిన సైనిక బలగాలు, అవసరమైన సైనిక సామర్థ్యాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, వాటిని సౌదీ అరేబియాలో వేగంగా మోహరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ఎంతమంది సైనికులను పంపుతారు? ఎప్పుడు పంపుతారు? అనే విషయాలను సంయుక్త ప్రకటనలో స్పష్టంగా వెల్లడించలేదు. అలాగే ప్రకటనలో హౌతీల పేరును ప్రత్యేకంగా ప్రస్తావించలేదు.
పాకిస్థాన్ బలగాలు సహాయక పాత్రలో..
ఈ అత్యవసర సమావేశానికి పాకిస్థాన్ తరఫున ఉప ప్రధాని ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ హాజరయ్యారు. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్, టర్కీ బలగాలు ఇప్పటికే అక్కడ సహాయక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. సౌదీ అరేబియా కోరిన సహాయాన్ని అందిస్తున్నామని చెప్పారు. టర్కీ, పాకిస్థాన్ సైన్యాలు ప్రస్తుతం సహాయక పాత్రలో ఉన్నాయని, పాకిస్థాన్ నిఘా, సమాచార సేకరణ (reconnaissance) కార్యకలాపాల్లోనూ పాల్గొంటోందని ఆయన వెల్లడించినట్లు నివేదిక పేర్కొంది. అయితే బలగాల సంఖ్య, వాటి మోహరింపు సమయం వంటి వివరాలను అధికారిక ప్రకటనలో వెల్లడించలేదు.
మక్కా, మదీనా లక్ష్యంగా దాడులను ఖండించిన మూడు దేశాలు
మక్కా డిఫెన్స్ అలయన్స్‌లోని మూడు దేశాలు సౌదీ అరేబియాలోని పవిత్ర నగరాలు మక్కా, మదీనాలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించాయి. అదేవిధంగా సౌదీలోని నగరాలు, పౌర ప్రాంతాలు, ఆర్థిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులను కూడా ఖండించాయి. సౌదీ సాయుధ బలగాలు అప్రమత్తత, సన్నద్ధత, వృత్తిపరమైన సామర్థ్యంతో దేశ భద్రత, ప్రాదేశిక సమగ్రతను కాపాడుతున్నాయని పాకిస్థాన్, టర్కీ ప్రశంసించాయి.
యెమెన్‌లో సైనిక చర్యల నేపథ్యంలో కీలక పరిణామం
మరోవైపు, హౌతీల ఆధీనంలో ఉన్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణానికి మద్దతు ఇచ్చే యెమెన్ ప్రభుత్వం ఆదివారం పెద్ద ఎత్తున సైనిక చర్య ప్రారంభించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే సౌదీ భద్రతకు ఎదురవుతున్న ముప్పులపై చర్చించేందుకు SPDC అత్యవసర సమావేశం నిర్వహించింది.
మక్కా డిఫెన్స్ అలయన్స్ అంటే ఏమిటి?
పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ మధ్య ఆగస్టులో కుదిరిన త్రైపాక్షిక రక్షణ ఒప్పందం సామూహిక నిరోధక శక్తి (collective deterrence) కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. మూడు దేశాల్లో ఏదైనా ఒకదానిపై సాయుధ దాడి జరిగితే, దానిని మిగతా రెండు దేశాలపై జరిగిన దాడిగానూ పరిగణించి సమిష్టిగా స్పందించేందుకు ఈ ఒప్పందం మార్గదర్శకంగా ఉంటుంది. తాజా అత్యవసర సమావేశంతో ఈ రక్షణ హామీలను ప్రాక్టికల్‌గా అమలు చేసే దిశగా మూడు దేశాలు ముందడుగు వేసినట్లు తెలుస్తోంది. అయితే సౌదీలోకి బలగాల మోహరింపుపై పూర్తి వివరాలు, కాలపట్టిక మాత్రం ఇంకా వెల్లడించలేదు.
తాజావార్తలు
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!