Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో ఇప్పుడు ఏ పెద్ద సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినా సరే, ప్రేక్షకులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్టోబర్ 9న థియేటర్లలోకి రావాల్సిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం మరోసారి వాయిదా పడటంతో సినీ ప్రియులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ సినిమా విషయంలో ఇప్పటికి మూడుసార్లు విడుదల తేదీలు మారడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. మొదట సమ్మర్ రిలీజ్ అన్నారు, ఆ తర్వాత అక్టోబర్ 2 అని ప్రకటించారు, చివరికి అక్టోబర్ 9న పక్కా అన్నారు. కానీ తీరా సమయానికి వచ్చేసరికి సినిమా మళ్లీ పోస్ట్ పోన్ అయింది.
సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ లేకుండా “ఫస్ట్ కాపీ స్టేటస్ ఏంటో పూర్తిస్థాయిలో చూడకుండానే తొందరపడి రిలీజ్ డేట్ ప్రకటించాం.. ఇకపై మరోసారి అలాంటి తప్పు చేయం” అంటూ నిర్మాత చెప్పారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. దసరా లాంటి అతిపెద్ద పండగ సీజన్ ను హాలిడేస్ తో సహా వేస్ట్ చేసుకోవడం వల్ల బాక్సాఫీస్ వద్ద రావాల్సిన భారీ కలెక్షన్లను మేకర్స్ కోల్పోయినట్లయింది. మళ్లీ ఇలాంటి సోలో పండగ డేట్ దొరకడం అంత సులభం కాదు.
Also Read
- 'Dada' : 'దాదా' ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
కోట్లాది రూపాయల బడ్జెట్ తో సినిమాలు నిర్మించే దర్శకనిర్మాతలు రిలీజ్ డేట్ దగ్గర ఎందుకు తడబడుతున్నారనేది ప్రధాన ప్రశ్న. పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ పనుల్లో ఆలస్యం ఒకవైపు ఐతే, మరోవైపు రిలీజ్ డేట్ల నిర్వహణ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల చేతుల్లోకి వెళ్లిపోవడమూ మరో కారణం. ఓటీటీ సంస్థలు ఇచ్చిన గడువు ప్రకారం థియేటర్లలో విడుదల కాకపోతే ఓటీటీ రైట్స్ బిజినెస్ డీల్స్ లో భారీగా కోతలు విధించే ప్రమాదం ఉంది. అయినా సరే రష్ పనులతో నాసిరకం ఔట్ పుట్ ఇచ్చి సోషల్ మీడియా ట్రోల్స్ కి గురవ్వడం కంటే, వాయిదా వేసుకోవడమే బెటర్ అని మేకర్స్ భావిస్తున్నారు.
కేవలం ఈ ఒక్క చిత్రమే కాదు ప్రభాస్ ఫౌజీ రిలీజ్ కూడా పోస్ట్ పోన్ అయింది. అలాగే ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందని, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ జూన్ 11న ‘డ్రాగన్’ వస్తుందని ప్రకటించినప్పటికీ రిలీజ్ అవుతాయో లేదోనని డౌట్ ఉంది. పోస్ట్ పోన్ సంస్కృతి వల్ల ప్రాజెక్ట్ బడ్జెట్ పెరగడమే కాకుండా, ప్రమోషన్ల కోసం ఖర్చు చేసిన కోట్లాది రూపాయలు బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. హీరో లేదా పెద్ద సినిమా థియేటర్ పోస్టర్ పై “రన్నింగ్ సక్సెస్ ఫుల్లీ” అని పడేవరకు ప్రేక్షకుడు రిలీజ్ డేట్ ని నమ్మలేని పరిస్థితులు టాలీవుడ్ లో నెలకొన్నాయి.
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తోలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి