దేశంలో అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజుకు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వావీ వరసలు, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ జూబ్లిహిల్స్ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రభుత్వాలు నిర్భయ, పోక్సో వంటి చట్టాలను తీసుకువచ్చినా కామాంధుల తీరులో మార్పు రావడం లేదు. మరింతగా కఠినంగా చట్టాలను మార్చాలంటూ బాధితులు కోరుతూ ఉన్నారు.
తాాజాగా మహారాష్ట్ర నాగ్ పూర్ లో ఘోరం జరిగింది. కరాటే శిక్షణ పేరుతో ఓ ట్రైనర్, మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. ముందుగా నాగ్ పూర్ జిల్లాలో గోపాల్ రామేశ్వర్ గొండానే(40) అనే కరాటే శిక్షకుడు, 11 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయంపై గతవారం బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతం బయటపడగానే మరో ఐదుగురు బాలికలు అతని నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు ఆరోపణలు చేస్తూ ముందుకు వచ్చారు. ప్రస్తుతం అతనిపై కన్హాస్ పోలీసులు బుధవారం ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. గత ఆరు నెలలుగా బాలికలను, రామేశ్వర్ వేధిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
భారతీయ సైన్యంలో ఎంపిక కావడానికి శిక్షణ ఇస్తానేనే నెపంతో బాధితులను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి వారిపై లైంగికదాడి చేసేవాడని ఎస్పీ విజయ్ మగర్ వెల్లడించారు. నిందితుడు విద్యార్థినులను వారి ఇల్ల వద్ద నుంచి పికప్ చేసి మోటర్ సైకిల్ పై ప్రాక్టీస్ కోసం తీసుకెళ్లేవాడు. ఈ విధంగా బాధిత తల్లిదండ్రులను నమ్మించి వారి పిల్లలపై లైంగిక దాడికి పాల్పడుతుండే వాడని పోలీసులు వెల్లడించారు. బాధితులరకు అన్ని విధాల సహాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. బాధితులు మైనర్లు కావడంతో అత్యాచారం సెక్షన్లతో పాటు పోక్సో కేసు కూడా నమోదు చేశారు. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.