Chennai Air Show: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో గల మెరీనా బీచ్ లో నిర్వహించిన ఎయిర్ షోలో విషాద ఘటన చోటు చేసుకుంది. తొక్కిసలాట జరగడంతో ఐదుగురు మరణించాగా.. డిహైడ్రేషన్ కారణంగా 260 మంది స్పృహ కోల్పోయి ఆసుపత్రిలో చేరారు. అందులో దాదాపు రెండు వందల మంది రికవరీ అయ్యి.. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. దీనిపై పెద్ద ఎత్తున అధికార- విపక్షాల మధ్య వివాదం కొనసాగుతుంది. ఇక, ఈ ఘటనకు ప్రభుత్వమే కారణమంటూ విపక్షాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక, విపక్షాల విమర్శలపై మంత్రి సుబ్రమణ్యన్ స్పందిస్తూ.. ఎయిర్ షోకు అన్ని ఏర్పాట్లు చేశామని 7500 మంది పోలీసులతో భద్రత తాగునీటి సదుపాయం కల్పించామన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ప్రతిపక్షాలు మాపై ఆరోపణలు చేస్తుందన్నారు.. డీహైడ్రేషన్ కు గురైన వారందరూ పూర్తిగా కోరుకున్నారని మంత్రి సుబ్రమణ్యన్ వేడుకున్నారు. మరోవైపు, చెన్నైలోని మెరినా బీచ్ లో నిర్వహించిన ఎయిర్ షో ఘటనలో ఐదుగురు మృతి చెందడం చాలా బాధాకరం అని డీఎంకే పార్టీ పార్లమెంట్ సభ్యురాలు కనిమొళి అన్నారు. నిర్వహించలేని సమావేశాలను ఎందుకు చేపట్టడం అంటూ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also: OTT : ఈ వారం థియేటర్ – ఓటీటీలోకి రానున్న సినిమాలు ఇవే..
కాగా, ఒక ప్రభుత్వ కార్యక్రమంలో కాకుండా డీఎంకే పార్టీ మీటింగ్ నిర్వహించారని మాజీ మంత్రి జయకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 లక్షల మంది ప్రజలకు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు అని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ సింబల్ కనబడేలా డిప్యూటీ సీఎం ఉదయనిది స్టాలిన్ ఎలా టీ షర్టు ధరిస్తాడు అని ప్రశ్నించారు. చొక్కా కొనుక్కునే దానికి డబ్బులు లేకపోతే మా పార్టీ నుంచి డిప్యూటీ సీఎంకు ఒక చొక్కా కొనిస్తామన్నారు. 2003లో జరిగిన ఎయిర్ షోకి 10 లక్షల మంది వస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అప్పటి సీఎం జయలలిత ఏర్పాట్లు చేశారని గుర్తు చేశారు. తమిళనాడు పరువు తీయొద్దండి పరిపాలన చేతకాకపోతే తప్పుకోండి అని మాజీమంత్రి జయకుమార్ డిమాండ్ చేశారు.